Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు యువకుడు... ఆంధ్రలోని పాడేరు ఏఎస్పీ... కణతలోకి తుపాకి బుల్లెట్... ఆత్మహత్యేనా...?

ఒక పోలీసు అధికారి అనుమానాస్పద స్థితిలో గురువారం మరణించారు. విశాఖ జిల్లా పాడేరు ఎఎస్‌పిగా ఉన్న శశికుమార్ తలలోని కుడివైపు కణతలో నుంచి తుపాకి గుండు దూసుకు వెళ్లడంతో మరణించారు. తొలుత మిస్ ఫైర్ వల్ల ఆయన మరణించి ఉండవచ్చన్న వార్తలు వచ్చాయి. మిస్ ఫైర్ అయితే

Advertiesment
Paderu ASP
, గురువారం, 16 జూన్ 2016 (15:55 IST)
ఒక పోలీసు అధికారి అనుమానాస్పద స్థితిలో గురువారం మరణించారు. విశాఖ జిల్లా పాడేరు ఎఎస్‌పిగా ఉన్న శశికుమార్ తలలోని కుడివైపు కణతలో నుంచి తుపాకి గుండు దూసుకు వెళ్లడంతో మరణించారు. తొలుత మిస్ ఫైర్ వల్ల ఆయన మరణించి ఉండవచ్చన్న వార్తలు వచ్చాయి. మిస్ ఫైర్ అయితే బుల్లెట్ మరెక్కడైనా దూసుకెళ్లే అవకాశం ఉందనీ, కానీ ఖచ్చితంగా కణతలోకి బుల్లెట్ దూసుకెళ్లడాన్ని చూస్తే ఇది ఆత్మహత్యేనన్న అనుమానంగా ఉందన్న అభిప్రాయాలు వచ్చాయి. 
 
ఆయన తన ఛాంబర్ లోనే కుప్పకూలిపోయారు. కాల్పుల శబ్దం వినిపించడంతో సిబ్బంది లోపలికి వెళ్లి చూడగా ఆయన రక్తపు మడుగులో ఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలోనే మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని పాడేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముప్పై ఏళ్ల యువకుడైన శశికుమార్ మూడు నెలల క్రితమే పాడేరులో చేరారు. అంతకు ముందు ఆళ్లగడ్డలో ఆయన పని చేశారు. శశికుమార్ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. కారణాలు తెలియవలసి ఉంది. యువకుడైన ఒక అధికారి మరణించడం దురదృష్టకరం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైతుల నుంచి ఖాళీ బాండ్ పత్రాలపై సంతకాలెందుకు?: టి సర్కారుకు హైకోర్టు