Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భరత మాత చిత్రంతో రూ. 100 నాణెం విడుదల.. నాదేముంది.. అంతా దేశానికే అంకితం

Advertiesment
100 Rupees Coin

సెల్వి

, గురువారం, 2 అక్టోబరు 2025 (10:49 IST)
100 Rupees Coin
రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ స్మారక పోస్టల్ స్టాంప్, ప్రత్యేక రూ.100 నాణెం విడుదల చేశారు. ఈ నాణెం, ఇండిపెండెంట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా, భరత మాత చిత్రం ఉంది. వరద ముద్రతో సింహంపై కూర్చుని ఆమె ఆ నాణెంలో కనిపిస్తోంది.
 
స్వతంత్ర్య భారతదేశ చరిత్రలో ఇండియన్ కరెన్సీపై భరతమాత ఉండటం ఇదే తొలిసారి. మరోవైపు భరతమాత వరదముద్రతో సింహంతో సహా ఉన్న చిత్రం ముద్రించారు. స్వయం సేవకులు భరత మాత ముందు భక్తి, అంకితభావంతో ప్రణామం చేస్తున్నట్టు చిత్రీకరించారు. 
 
1925 నుంచి 2025 వరకూ 100 సంవత్సరాల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని నాణెంపై రాసి ఉంది. శతాబ్ద కాలంగా సేవ, అంకితభావంతో ఆర్ఎస్ఎస్ సాగిస్తున్న సుదీర్ఘ ప్రయాణం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని ప్రశంసించారు. దేశంపై ఉన్న భక్తి, త్యాగం, నిబద్ధతకు ఆర్ఎస్ఎస్ నిదర్శనమన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Almatti Dam: ఆల్మట్టి ఎత్తు పెరుగుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి ఫైర్