Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సిమంధర్‌తో భాగస్వామ్యం చేసుకున్న బెకర్

Advertiesment
image

ఐవీఆర్

, శనివారం, 2 ఆగస్టు 2025 (20:23 IST)
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కంపెనీలలో ఒకటైన సిమంధర్ ఎడ్యుకేషన్‌ను అకౌంటింగ్ పరీక్ష సమీక్ష, నిరంతర ప్రొఫెషనల్ విద్యలో ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బెకర్ తమ వ్యూహాత్మక భాగస్వామిగా ఎంచుకుంది. ఈ భాగస్వామ్యం కింద, సిమంధర్ ఎడ్యుకేషన్ భారతదేశంలో బెకర్స్ సిపిఏ, సిఎంఏ పరీక్ష సమీక్ష యొక్క ఏకైక అధీకృత సంస్థగా కార్యకలాపాలను నిర్వహించనుంది.
 
భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా సర్టిఫై చేయబడిన అకౌంటెంట్లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చటానికి ఈ భాగస్వామ్యం అకౌంటింగ్ విద్యలో రెండు విశ్వసనీయ పేర్లను ఒకచోట చేర్చింది. భారతదేశంలో లైసెన్స్ పొందిన సిపిఏల సంఖ్య 2020 నుండి 450% పెరిగింది, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన శిక్షణా పరిష్కారాలకు కూడా డిమాండ్ అంతే గొప్పగా వుంది. ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామి సంస్థలు భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరింపజేస్తున్నందున, భారతీయ సంస్థలు అంతర్జాతీయ అకౌంటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా కార్యకలాపాలను నిర్వహిస్తున్నందున, బెకర్, సిమంధర్ ఎడ్యుకేషన్ మధ్య ఈ భాగస్వామ్యం దేశంలో ఆర్థిక, అకౌంటింగ్ ప్రతిభ యొక్క భవిష్యత్తును రూపొందించడంలో కీలక పాత్ర పోషించనుంది.
 
బెకర్, సిమంధర్ ఎడ్యుకేషన్ దీర్ఘకాలిక భాగస్వామ్యం కలిగి ఉన్నప్పటికీ, భారతీయ అకౌంటింగ్, ఫైనాన్స్ నిపుణులు విలువైన పరిజ్ఞానం సంపాదించడంలో సహాయపడటానికి అత్యున్నత నాణ్యత గల కోర్సులను అందించడానికి ఈ భాగస్వామ్యం, వారి భాగస్వామ్య దృష్టిని విస్తరిస్తుంది. బెకర్ యొక్క ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ పరీక్ష సమీక్ష కోర్సులను సిమంధర్ యొక్క నిపుణుల బోధన, మార్గదర్శకత్వం, కెరీర్ మద్దతుతో మిళితం చేసే మరింత సమగ్రమైన, స్థానికీకరించిన అభ్యాస అనుభవం నుండి భారతీయ విద్యార్థులు ఇప్పుడు ప్రయోజనం పొందుతారు.
 
భారతదేశం వ్యాప్తంగా సిపిఏ, సిఎంఏ అభ్యర్థులు బెకర్ యొక్క ఉన్నత శ్రేణి పరీక్ష వనరులకు అవకాశాలను పొందుతారు, వీటిలో సమగ్ర పాఠ్యపుస్తకాలు, సామగ్రి, ఏఐ-ఆధారిత అధ్యయన సహాయకుడు, అనుకూలీకరించదగిన అధ్యయన ప్లానర్, అపరిమిత అభ్యాస పరీక్షలు, పరీక్ష సంసిద్ధతను పెంచడానికి రూపొందించబడిన అనుకూల అభ్యాస సాధనాలు ఉన్నాయి. ఈ సాధనాలు సిమంధర్ అందించే లైవ్ ఫ్యాకల్టీ నేతృత్వంలోని తరగతులు, వన్-ఆన్-వన్ మార్గదర్శకత్వం, పరిశ్రమ-నిర్దిష్ట వర్క్‌షాప్‌లు, బిగ్ 4తో సహా అగ్ర సంస్థలతో ప్లేస్‌మెంట్ మద్దతు వంటి వాటితో అనుసంధానించబడతాయి.
 
“భారతీయ నిపుణులకు గ్లోబల్ అకౌంటింగ్ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, ఫలితాల ఆధారితంగా మార్చడానికి సిమంధర్ చేస్తోన్న ప్రయాణంలో ఈ ప్రత్యేక భాగస్వామ్యం ఒక ప్రధాన మైలురాయి” అని సిఏ/యుఎస్ సిపిఏ-సిమంధర్ ఎడ్యుకేషన్ యొక్క సహ వ్యవస్థాపకుడు శ్రీపాల్ జైన్ అన్నారు. “ప్రపంచ అర్హతలు, స్థానిక ప్రతిభ మధ్య అంతరాన్ని తగ్గించడం మా లక్ష్యం. బెకర్‌తో ఈ ఒప్పందం విస్తృత స్థాయిలో మా సామర్థ్యాన్ని మరింత బలపరుస్తుంది. మేము విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడంలో సహాయం చేయడమే కాదు, ప్రపంచ ఆర్థిక వాతావరణంలో నాయకత్వం వహించగల, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న నిపుణులను తీర్చిదిద్దుతున్నాము” అని అన్నారు. 
 
సిమంధర్ ఎడ్యుకేషన్ ఈ భాగస్వామ్యాన్ని భారతదేశం అంతటా, ముఖ్యంగా అంతర్జాతీయ అకౌంటింగ్ ఆధారాలపై ఆసక్తి వేగంగా పెరుగుతున్న టైర్ 2, టైర్ 3 నగరాల్లో తన కార్యకలాపాలను పెంచుకోవడానికి ఉపయోగించుకుంటుంది. అదే సమయంలో, బెకర్ భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తుంది, ఇది గ్లోబల్ అకౌంటింగ్ సర్టిఫికేషన్ల కోసం వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటి.
 
"ఈ ప్రత్యేక భాగస్వామ్యం భారతదేశంలో అకౌంటింగ్ నిపుణులకు అసాధారణ అవకాశాలను అందించడంలో మా నిబద్ధతను నొక్కి చెబుతుంది" అని బెకర్ అధ్యక్షుడు ఎడ్ క్లార్క్ అన్నారు. "గత ఐదు సంవత్సరాలలో భారతదేశంలో బెకర్ కార్యకలాపాలు 300% కంటే ఎక్కువ పెరిగాయి. ఇప్పుడు, ఈ భాగస్వామ్యం ప్రపంచ స్థాయి వనరులు, నిర్మాణాత్మక స్థానిక మద్దతు ద్వారా మరింత మంది విద్యార్థులు తమ వృత్తిపరమైన లక్ష్యాలను నమ్మకంగా సాధించడానికి మాకు సాధికారత కల్పించడానికి అనుమతిస్తుంది" అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నడ నటి రమ్యపై అత్యాచార బెదిరింపులు.. ముగ్గురు అరెస్ట్.. దర్శన్ ఏం చేస్తున్నారు?