Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

2021లో బ్యాంకు సెలవులు ఇవే... జనవరిలో 14 రోజుల హాలిడేస్

2021లో బ్యాంకు సెలవులు ఇవే... జనవరిలో 14 రోజుల హాలిడేస్
, మంగళవారం, 29 డిశెంబరు 2020 (09:17 IST)
మరికొన్ని గంటల్లో కరోనా నామ సంవత్సరంగా పేరుగాంచిన 2020 సంవత్సరం ముగిసిపోయి.. కొత్త యేడాది 2021 ఆరంభంకానుంది. ఈ సంవత్సరంపై ప్రతి ఒక్కరూ గంపెడాశలు పెట్టుకునివున్నారు. దీనికి కారణం 2019లో డిసెంబరు నెలలో వెలుగు చూసిన కరోనా వైరస్ మహమ్మారి... 2020 యేడాది మొత్తం ప్రతి ఒక్కరినీ అతలాకుతలం చేసింది. కోట్లాది మంది ఉపాధిని కోల్పోయారు. దీంతో కొత్త యేడాదిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2021లో పరిస్థితులు చక్కబడి, తిరిగి పూర్వవైభవం సంతరించుకుంటుందని భావిస్తున్నారు. 
 
అయితే, ఈ కొత్త యేడాదిలో బ్యాంకు ఉద్యోగులకు పండగే పండగ. ఏకంగా 40కి పైగా సెలవులు రానున్నాయి. ఈ మేరకు సెలవుల జాబితాను ప్రకటిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నెలా 2, 4వ శనివారాలు ఇప్పటికే సెలవులుగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. వాటితో పాటు జనవరి26 (రిపబ్లిక్ డే), ఫిబ్రవరిలో ఆదివారాలు మాత్రమే సెలవులని ఆర్బీఐ ప్రకటించింది.
 
మార్చి 11న (మహా శివరాత్రి), 29న (హోలీ) సెలవులు రానుండగా, ఏప్రిల్‌ 1న (గురువారం) ఖాతాల ముగింపు రోజు. ఆపై 2వ తేదీ (గుడ్‌ ఫ్రైడే), 14 (అంబేడ్కర్‌ జయంతి) రానున్నాయి. మేలో 13న రంజాన్, జూలై 20న బక్రీద్, ఆగస్ట్ 19న మొహర్రం, 30న శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్‌ 10 (వినాయక చవితి సెలవులు ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది.
 
ఆ పిమ్మట అక్టోబరు 2 (గాంధీ జయంతి), 16 (దసరా), నవంబర్ 4 (దీపావళి), 19న గురునానక్ జయంతి, డిసెంబర్ 25 (క్రిస్మస్) సందర్భంగా బ్యాంకులు పనిచేయబోవు. ఇదేసమయంలో సంక్రాంతి (జనవరి 14)న కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే సెలవు అమలవుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. 
 
కాగా, ఒక్క జనవరి నెలలోనే ఏకంగా 14 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఐదు ఆదివారాల(జనవరి 3, 10, 17, 24, 31)తో పాటు.. నెలలో రెండో శనివారం (జనవరి 9), నాలుగో శనివారం(జనవరి 24), రెండు జాతీయ సెలవు దినాల(జనవరి 1, 26)తో పాటు మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 
 
ఇందులో జాతీయ సెలవు దినాలు 9 ఉండగా, ఏడు ప్రాంతీయ సెలవు దినాలు ఉన్నాయి. ప్రాంతీయ సెలవు దినాలను పరిశీలిస్తే, జనవరి 2 కొత్త సంవత్సర వేడుకలు, 14న మకర సంక్రాంతి, 15న తిరువళ్ళూవర్ డే, 16న రైతు ఉత్సవం, 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, 25న ఇమోయిను ఇరాత్పా, 26న గాన్‌గై‌లు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రైలు కిందపడి కర్నాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య!!