బంగారం వెండి ధరలు ఇప్పుడే రెక్కలొచ్చాయి. గరిష్ఠంగా ప్రస్తుతం లక్ష మార్కును దాటాయి. ఈ నేపథ్యంలో 2026లో బంగారం ధరలు ఎలా వుంటాయనే విషయాన్ని దివంగత బల్గేరియన్ సైకిక్ బాబా వంగ గణాంకాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	2026లో తప్పకుండా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయని వంగ తెలిపారు. దీంతో బంగారం దాచుకున్నవారు కోటీశ్వరులేనని వంగా తెలిపారు. పదిగ్రాముల బంగారం ధర రూ.1,62,500 నుంచి రూ.1,82,000 మధ్య ఉండొచ్చని అంచనా. ఇది బంగారం ధరల్లో కొత్త రికార్డు అనే చెప్పుకోవాలి.
	 
	ప్రపంచ మార్కెట్లలో అస్థిరత వల్ల అది ఆర్థిక మాంద్యానికి దారితీయవచ్చు. ప్రపంచంలో ఆర్ధిక సంక్షోభం ఏర్పడితే బంగారం ధరలు 25 నుంచి 40 శాతం పెరగొచ్చని మార్కెట్ నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. వచ్చే దీపావళి నాటికి బంగారం ధరలు మరింతగా పెరిగిపోతుంది. 
	 
	ఒకవేళ పెద్ద సంక్షోభం తలెత్తితే, 2026 దీపావళి నాటికి భారతదేశంలో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.62 లక్షల నుండి రూ.1.82 లక్షల మధ్య చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులకు ఇది శుభ సమయం.