Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఔరెలియా కోసం అలియా

Advertiesment
ఔరెలియా కోసం అలియా
, గురువారం, 1 జులై 2021 (18:46 IST)
మహిళల కోసం సుప్రసిద్ధ వస్త్ర సంస్ధ టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌ కో లిమిటెడ్‌, తమ ఎథ్నిక్‌ వేర్‌ బ్రాండ్‌ ఔరెలియా కోసం బాలీవుడ్‌ నటి అలియా భట్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకుంది. తన అద్భుతమైన నటనాచాతుర్యం పరంగా మాత్రమే కాదు, తన ఫ్యాషన్‌ అభిరుచులపరంగా కూడా ఖ్యాతి గడించిన అలియా ఇప్పుడు భారతీయ ఎథ్నిక్‌ వేర్‌ బ్రాండ్‌కు ప్రచారం చేయనున్నారు.
 
అలియాతో భాగస్వామ్యం గురించి టీసీఎన్‌ఎస్‌ క్లాతింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనంత్‌ కుమార్‌ దాగా మాట్లాడుతూ ‘‘ఔరెలియా ఎల్లప్పుడూ సౌకర్యవంతమైన శైలిని ప్రోత్సహిస్తూనే, మహిళలు తమదైన అందానికి ప్రాతినిధ్యం ఎంచుకోవాల్సిందిగానూ ఇది ప్రోత్సహిస్తుంది. అలియా భట్‌తో ఒప్పందం చేసుకోవడమనేది ఆ భావాన్ని ప్రతిధ్వనించే దిశగా చేసిన వ్యూహాత్మక నిర్ణయం.
 
తమ సౌకర్యవంతమైన శైలిని అభిమానించే యూత్‌ ఐకాన్‌ అలియా. ఈ బ్రాండ్‌ యొక్క యవ్వన చిత్రం, స్వాభావికమైన అవరోధాలను విశ్వసించని నేటి తరపు మహిళలకు అనుకూలంగా ఉంటుంది. స్ర్కీన్‌పై మాత్రమే కాదు, వెలుపల కూడా అదే తరహా భావాలను అలియా ప్రదర్శిస్తుంది’’ అని అన్నారు.
 
భారతీయ మహిళల వస్త్ర మార్కెట్‌లో తమ ఆధిపత్యం చూపుతున్న ఔరెలియా, నేటి తరపు మహిళల ఎథ్నిక్‌ వేర్‌ అవసరాలను తీరుస్తుంది. ఈ బ్రాండ్‌ ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా 220కు పైగా ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ ఔట్‌లెట్లు ద్వారా లభ్యం కావడంతో పాటుగా ఇండియా, శ్రీలంక, నేపాల్‌, మారిషస్‌లలోని 150కు పైగా నగరాల్లో 1000+ భారీ ఫార్మాట్‌ స్టోర్లలో కూడా లభ్యమవుతుంది.
 
ఈ బ్రాండ్‌ భాగస్వామ్యం గురించి అలియా భట్‌ మాట్లాడుతూ ‘‘విభిన్న వయసులతో పాటుగా వృత్తులలో ఉన్న మహిళలను సైతం తమ సౌకర్యవంతమైన డిజైన్స్‌, శైలి ద్వారా ఆకట్టుకుంటున్న ఎథ్నిక్‌ వేర్‌ బ్రాండ్‌ ఔరెలియా. సంప్రదాయాలను ప్రతిబింబిస్తూనే ఎథ్నిక్‌ వేర్‌ను పునర్నిర్వచిస్తుందీ బ్రాండ్‌. మా భాగస్వామ్యం సుదీర్ఘకాలం కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫుడ్ డెలివరీ చేసేందుకు వచ్చి.. మహిళా వైద్యురాలిపై అత్యాచారం