Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెల్మెట్ పెట్టుకుని ఏటీఎం సెంటర్‌కి వెళ్తే? (video)

హెల్మెట్ పెట్టుకుని ఏటీఎం సెంటర్‌కి వెళ్తే? (video)
, మంగళవారం, 27 ఆగస్టు 2019 (13:50 IST)
ఏటీఎంలలో రోజూ నాలుగైదు సార్లు డబ్బు డ్రా చేస్తున్నారా? అయితే ఇకపై అలాంటివి కుదరవు. ఎందుకంటే రోజుకు ఒక్కసారే ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకునే పరిమితి ఇవ్వాలని బ్యాంకులు యోచిస్తున్నాయి. బ్యాంక్, ఏటీఎం మోసాలను నియంత్రించే దిశగా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో రెండు ఏటీఎం లావాదేవీల మధ్య ఆరు నుంచి 12 గంటల గ్యాప్ వుండేలా కొత్త నిబంధనను తీసుకురానున్నారు. ఈ మేరకు ఢిల్లీ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీలో తమ ప్రతిపాదనను బ్యాంకర్లు వ్యక్తపరిచారు. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే కస్టమర్లు ఏటీఎం నుంచి డబ్బులు నిర్ణీత సమయంలో తీసుకోవడానికి వీలుపడదు.
 
అంతేగాకుండా కమ్యూనికేషన్ ఫీచర్‌తో ఏటీఎంలకు సెంట్రలైజ్‌డ్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్యాంకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎవరైనా హెల్మెట్ పెట్టుకుని ఏటీఎంలోకి వెళ్తే... 'హెల్మెట్‌ను తొలగించండి' అనే వాయిస్ వినిపించనుంది. ఇదే విధానాన్ని బ్యాంకులలో కూడా ప్రవేశపెట్టాలని బ్యాంకర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇక కొన్ని ఏటీఎంలలో సెక్యూరిటీ గార్డ్ లేకపోయినా.. కెమెరాతో ఆ ప్రదేశాన్ని కన్నేసి ఉంచనున్నారు. ఇదిలా ఉంటే.. బ్యాంకర్ల సమావేశంలో ఎస్బీఐ, కెనరా బ్యాంక్‌లు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి.
 
ఎస్బీఐ తన కస్టమర్లకు విత్‌డ్రా లిమిట్ రూ.20వేలకు తగ్గించగా.. పదివేల రూపాయలకు మించి విత్‌డ్రా చేసే వారికి ఓటీపీ కచ్చితం చేసేలా కెనరా బ్యాంకు భావించింది. కాగా.. ఏడాదేడాదికి ఏటీఎం మోసాలు పెరిగిపోతున్నారు. దేశంలో ఏటీఎం మోసాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. ఢిల్లీ రెండో స్థానంలో ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వానరంలో కారుణ్యం : కాకుల దాడి నుంచి పిల్లిపిల్లను రక్షించిన కోతి