Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమరావతిని ఓ భ్రమరావతిగా చూపించారు.. ఓన్లీ బాహుబలి సెట్టింగ్సే..

Advertiesment
Jogi Ramesh
, శనివారం, 20 జులై 2019 (12:57 IST)
రాజధాని పేరుతో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్కామ్‌కు పాల్పడ్డారని పెడన ఎంఎల్ ఏ శ్రీ జోగిరమేష్ ప్రెస్ మీట్‌లో విమర్శలు గుప్పించారు. బాహుబలి గ్రాఫిక్స్ సెట్టింగ్స్ తప్ప ఎల్లో మీడియా ప్రచారార్భాటాలు తప్ప కనీసం రాజధానికి రహదారులు కూడా నిర్మించలేదని దుయ్యబట్టారు.


రాజధానిలో చంద్రబాబు సర్కార్ అడగడునా ఉల్లంఘనలకు పాల్పడిందని.. చంద్రబాబూ రాజధాని రైతులు మీతో కలసి వచ్చారా? అంటూ ప్రశ్నించారు. 
 
అమరావతిని ఓ భ్రమరావతిగా చూపించారు. మీరు ఇంత దారుణంగా రాజధాని డిజైన్స్ ఇచ్చారు. మంత్రులను, అధికారులను పంపించి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. మకీ సంస్థ మీ అసమర్థతను అవినీతిని ఎండగడుతూ బహిరంగ లేఖ రాసింది. -ప్రపంచబ్యాంక్ రుణం వెనకకు వెళ్లడమేంటి అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు. 
 
ఇంకా ఆ బ్యాంక్ ఎప్పుడు రుణం ఇస్తానని చెప్పింది. ప్రపంచబ్యాంక్ ద్వారా జూన్ 12న ఓ లేఖ వచ్చింది.  రాజధాని ప్రాంతంలో అన్ని వర్గాలు వ్యతిరేకంగా ఉన్నారు. సామాజిక న్యాయం పాటించలేదు. వ్యవసాయ భూమిని ప్రభుత్వం రైతుల వద్దనుంచి లాక్కుంది అని ఆ లేఖలో ఉంది.  ఆ నాటికి శ్రీ వైయస్ జగన్ గారు అధికారం చేపట్టి 12 రోజులైంది.
 
చంద్రబాబు నిర్వాహకం వల్లనే ప్రపంచబ్యాంక్ రుణం రాలేదు. చంద్రబాబూ మీ అసమర్ధత వల్లనే ఇలా జరిగిందని జోగిరమేష్ ధ్వజమెత్తారు. ఏపిలో చంద్రబాబుదే తుగ్లక్ పాలన అని.. లోకేష్ ట్వీట్లు చేసేముందు ఈ విషయం తెలుసుకుంటే మంచిదని సెటైర్లు విసిరారు. 
 
చంద్రబాబు రాజధానిలో ఎందుకు ఇల్లు కట్టుకోలేకపోయారు. ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ రాజధాని నడిబొడ్డున గృహం నిర్మించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలి. రాజధాని నిర్మాణం పేరుతో ఎంత దోచుకున్నారో అంతా బయటకు తీయిస్తాం. చంద్రబాబు టిడిపి నేతలు రాజధాని నిర్మాణంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 
 
రాజధాని ప్రాంత రైతులకు మీరు ఏమాత్రం న్యాయం చేశారు? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని  ప్రాంతంలో భూములు కేటాయింపుల దగ్గర్నుంచి అన్నింటా ఉల్లంఘనలే? నని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చి 50 రోజులే అయినా ప్రజల మనస్సులు చూరగొన్నామని గుర్తు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

72 గంటల్లో రేషన్‌కార్డు అక్టోబరు నుంచి జారీ..