Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నగదు నిల్వలు నిండుకున్నాయ్.. 24 వరకు ఏటీఎంలు క్లోజ్..?

పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. బ్యాంకుల్లో కొత్త నోట్ల నగదు నిల్వలు నిండుకున్నాయి. దీంతో బ్యాంకు ముందు నో క్యాష్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి.

Advertiesment
నగదు నిల్వలు నిండుకున్నాయ్.. 24 వరకు ఏటీఎంలు క్లోజ్..?
, శుక్రవారం, 18 నవంబరు 2016 (11:05 IST)
పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. బ్యాంకుల్లో కొత్త నోట్ల నగదు నిల్వలు నిండుకున్నాయి. దీంతో బ్యాంకు ముందు నో క్యాష్ అని బోర్డులు దర్శనమిస్తున్నాయి. 
 
నిజానికి పాత నోట్ల మార్పిడి విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దని.. తగినంత నగదు ఉందని రిజర్వ్ బ్యాంక్ చెబుతున్నప్పటికీ.. తెలంగాణాలో ఏటీఎంలు మాత్రం ఈ నెల 24 వరకు ఖాళీగా ఉండే పరిస్థితి కనబడుతోంది. అంటే అప్పటివరకు వీటి షట్టర్లు మూసే ఉంటాయన్న మాట. ప్రస్తుత పరిస్థితి ఈ నెల 24 వరకు కొనసాగవచ్చునని రిజర్వ్ బ్యాంకు అధికారులు అంటున్నారు. 
 
ఏటీఎంలు పని చేయకపోవడాన్ని ఆయన ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్, జనరల్ మేనేజర్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల దృష్టికి తేగా.. వారీ విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలిసింది. కనీసం 100, 50, 20 నోట్లయినా వీటిలో ఉండేలా చూడాలని ఆయన కోరగా.. ఈ విషయంలో తామేమీ చేయలేమని వాళ్ళు చేతులెత్తేశారని అంటున్నారు.
 
కాగా తెలంగాణాలో సుమారు 50 శాతం ఏటీఎంలు పని చేయడం లేదట. రాష్ట్రంలో దాదాపు 8,458 ఏటీఎంలు ఉండగా.. వీటిలో 5 వేలు పని చేయడంలేదని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. వీటిలో కొన్ని పని చేసినప్పటికీ.. వీటి నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకునే సౌకర్యం లేదట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసిస్ చీఫ్ నిద్రించేటప్పుడు కూడా వాటిని తీసి పక్కనబెట్టడా? అనుమానం వస్తే?