Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధుల చికిత్సకై ఆస్ట్రాజెనెకా యొక్క డపాగ్లిఫ్లోజిన్‌

Advertiesment
AstraZeneca
, శుక్రవారం, 12 ఫిబ్రవరి 2021 (19:14 IST)
సుప్రసిద్ధ సైన్స్‌ ఆధారిత బయో ఫార్మాస్యూటికల్‌ కంపెనీ ఆస్ట్రాజెనెకా ఇండియా (ఆస్ట్రాజెనెకా ఫార్మా ఇండియా లిమిటెడ్‌) నేడు తాము తమ యాంటీ డయాబెటిక్‌ డ్రగ్‌ డపాగ్లిఫ్లోజిన్‌ కోసం మార్కెటింగ్‌ అనుమతులు పొందినట్లు వెల్లడించింది. భారతదేశంలో దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి (సీకెడీ)తో బాధపడుతున్న రోగులకు మూడవ దశ వరకూ వాడేందుకు దీనిని అనుమతించారు. ఈ అనుమతులు అందుకోవడం ద్వారా డపాగ్లిఫ్లోజిన్‌ మాత్రలను 10ఎంజీ పరిమాణంలో ఆవిష్కరించడం ద్వారా భారతదేశంలో నెఫ్రాలజిస్ట్‌లకు నూతన మార్గం అందుబాటులోకి వచ్చింది.
 
ఆస్ట్రాజెనెకా యొక్క డపాగ్లిఫ్లోజిన్‌ ఇప్పుడు ఈ శ్రేణిలో సమర్థతను చూపిన మొట్టమొదటి ఔషదంగా నిలువడంతో పాటుగా దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి(సీకెడీ)తో బాధపడుతున్న రోగులకు సురక్షితంగానూ నిలుస్తుంది. ఈ డపాగ్లిఫ్లోజిన్‌ అధ్యయన ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం, సీకెడీ వృద్ధిని గణనీయంగా తగ్గించడంతో పాటుగా టైప్‌ 2 మధుమేహ రోగులకు సైతం మెరుగ్గా పనిచేస్తుంది. ఈ డాపా-సీకెడీ అధ్యయనంను 30 మార్చి 2020వ తేదీన అంతర్జాతీయంగా దీని సమర్ధత, భద్రత కారణంగా ముగించారు.
 
వృద్ధి చెందుతున్న ప్రజా ఆరోగ్య సమస్యగా సీకెడీ నిలుస్తుంది. అంతర్జాతీయ వ్యాధి భారపు నివేదిక 2015 వెల్లడించే దాని ప్రకారం సాధారణ మరణాలకు కారణమవుతున్న 12వ కారణంగా సీకెడీ నిలుస్తుంది. గత 10 సంవత్సరాలుగా మరణాల రేటు 37.1% వృద్ధి చెందుతుంది. ఇది తీవ్రమైన ప్రోగ్రెసివ్‌ కండీషన్‌. మూత్రపిండాల పనితీరు తగ్గడం మరియు/లేదా మూత్రపిండాలు పాడవడం కారణంగా ప్రపంచవ్యాప్తంగా 70కోట్ల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. వీరిలో చాలా మందికి తమకు సమస్య ఉన్నట్లే తెలియదు.
 
 భారతదేశంలో సీకెడీ గణంకాలను చూస్తే నూరుకోట్ల  జనాభాలో 17.2%కు పైగా దీని బారినపడ్డారని అంచనా. వృద్ధి చెందుతున్న సీకెడీ ఇప్పుడు అతి తీవ్రమైన సమస్యగా ఆరోగ్య పరంగా మాత్రమే గాక భావి సంవత్సరాలకు ఆర్ధిక భారంగా కూడా మారవచ్చు. రోగులలో గణనీయంగా మృత్యువాత పడటానికి, హార్ట్‌ ఫెయిల్యూర్‌, ముందుగా మరణాలు వంటి కార్డియోవాస్క్యులర్‌ ప్రమాదం (సీవీ) వృద్ధి చెందడానికి సీకెడీ కారణమవుతుంది. సీకెడీకి సంబంధించి కొన్ని సమస్యలను తీర్చేందుకు కొన్ని ఔషదాలు లేదా మూత్రపిండాల వ్యాధుల వృద్ధి తీవ్రత తగ్గించడానికి కొన్ని ఔషదాలు అందుబాటులో  ఉన్నవి.
 
సమర్థతను వెల్లడించేందుకు చేసిన మొదటి అధ్యయనం డాపా-సీకెడీ. మధుమేహులు లేదా మధుమేహం లేకపోయినప్పటికీ సీకెడీ రోగులలో జీవించే అవకాశాలను ఇది వృద్ధి చేస్తుంది. డాక్టర్‌ అనిల్‌ కుక్రేజా, వైస్‌ ప్రెసిడెంట్‌- మెడికల్‌ ఎఫైర్స్‌ అండ్‌ రెగ్యులేటరీ, అస్ర్టాజెనెకా  ఇండియా మాట్లాడుతూ, ‘‘అంటువ్యాధులు కానటువంటి వాటికి సృజనాత్మక పరిష్కారాలను అందించడంలో ఆస్ట్రాజెనెకా ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో  చికిత్సలు ఉన్నప్పటికీ ప్రభావవంతంగా సీకెడీని నిర్వహించాల్సిన ఆవశ్యకత అంతర్జాతీయంగా ఉంది. భారతదేశంలో డపాగ్లిఫ్లోజిన్‌కు అనుమతులు ఇప్పుడు లభించాయి. ఇప్పటికే టైప్‌ 2 మధుమేహులు, ఎంపిక చేసిన హార్ట్‌ ఫెయిల్యూర్‌ చికిత్సలో వినియోగిస్తున్నారు. ఇప్పుడు నెఫ్రాలజిస్ట్‌లు సీకెడీ నిర్వహణ కోసం దీనిని వాడవచ్చు.  సీకెడీ నిర్వహణలో ప్రభావాన్ని చూపిన మొట్టమొదటి ఎస్‌జీఎల్‌టీ2 ఇన్హిబిటర్‌ ఇది’’ అని అన్నారు
 
డాక్టర్‌ దినేష్‌ ఖుల్లార్‌, నేషనల్‌ లీడ్‌ ఇన్వెస్టిగేటర్‌, డాపా-సీకెడీ, ఇండియా మాట్లాడుతూ, ‘‘ఎస్‌జీఎల్‌టీ2 ఇన్హిబిటర్‌ డపాగ్లిఫ్లోజిన్‌, అవసరమైనంత నిరూపిత ఆధారిత పరిశోధనను అందించింది. టైప్‌ 2 మధుమేహ నిర్వహణలో ఇది ప్రభావవంతంగా పనిచేయడంతో పాటుగా కొన్ని హార్ట్‌ ఫెయిల్యూర్‌ కేసులలోనూ సమర్థత చాటింది. ఇప్పుడు దీనిని సురక్షితంగా సీకెడీ వ్యాధుల వృద్ధిని నెమ్మది చేసేందుకు మధుమేహులతో పాటుగా మధుమేహులేతరులపై కూడా వాడవచ్చు. భారతదేశంలో మధుమేహం మరియు దాని సమస్యలను ప్రభావవంతంగా నిర్వహించడంలో ఇది ఎంతో దూరం వెళ్లనుంది. భారతదేశంలో నియంత్రణ సంస్థల నుంచి దీనికి అనుమతులు రావడం స్వాగతించతగినది. ఇది సీకెడీ రోగులకు ప్రయోజనం కలిగించడంతో పాటుగా మధుమేహులు మరియు ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన మధుమేహులేతరకులకు సైతం ప్రయోజనం కలిగించనుంది’’అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా మహమ్మారితో డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కలు కనిపించాయట.. ఊపిరితిత్తుల్లో?