Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రయాణ నిబంధనలను సడలించిన కేరళ, ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సేవలు సిద్ధం

ప్రయాణ నిబంధనలను సడలించిన కేరళ, ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ సేవలు సిద్ధం
, గురువారం, 15 అక్టోబరు 2020 (20:54 IST)
తమ పర్యాటక ప్రాంతాలను తెరువడంతో పాటుగా దశల వారీగా ప్రయాణ నిబంధనలను సైతం సడలించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ప్రపంచంలో సుప్రసిద్ధ హోటల్‌ చైన్స్‌లో ఒకటైన ఓయో హోటల్స్‌ అండ్‌ హోమ్స్‌ తాము అక్టోబర్‌ 12వ తేదీ నుంచి కేరళ రాష్ట్రంలో అతిథులను స్వాగతించడానికి సిద్ధమైనట్లుగా వెల్లడించింది. యాత్రికులకు మరింతగా మద్దతునందిస్తూ, ఓయో ఇటీవలనే అన్ని ప్రయాణ సంబంధిత సేవలకూ మద్దతునందించేందుకు ఏకీకృత పరిష్కారంగా ఓయో యాప్‌ను భారతదేశంలో ఆవిష్కరించింది.
 
ఈ విభాగం వినియోగదారులకు రాష్ట్రంలోని ప్రయాణ మార్గదర్శకాలను గురించి సమగ్రమైన అవగాహన కల్పిస్తుంది. దీనిలో ఈ-పాస్‌/ప్రవేశ నమోదు అవసరాలు, హోటల్‌ బుకింగ్‌ చేసుకునేటప్పుడునిబంధనలు, క్వారంటైన్‌ అవసరాలు వంటివి ఉంటాయి. తాజా రాష్ట్ర మార్గదరక్శకాల ప్రకారం, స్వల్ప పర్యటనల కోసం వచ్చే దేశీయ యాత్రికులు (వారం రోజుల లోపు) క్వారంటైన్‌ నుంచి మినహాయించబడతారు. అయితే వారు తప్పనిసరిగా కోవిడ్‌ జాగ్రత్త పోర్టల్‌లో  నమోదుచేసుకోవడంతో పాటుగా ఈ-పాస్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఏడు రోజుల కన్నా ఎక్కువ రోజులు కేరళ సందర్శించాలనుకుంటే, వారు తప్పనిసరిగా కోవిడ్-నెగిటివ్‌ సర్టిఫికెట్‌ను వారు రావడానికి 48 గంటల ముందుగానే సమర్పించాల్సి ఉంటుంది లేదంటే రాష్ట్రంలో ప్రవేశించిన వెంటనే కోవిడ్-19 పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది.
 
యాత్రికులు అతి సులభంగా ఓయో హోటల్‌ను ముందుగానే శానిటైజ్డ్‌ స్టేస్‌ ట్యాగ్‌ ఉన్న హోటల్స్‌లో ఓయో బుకింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. యాప్‌, వెబ్‌సైట్‌, ఈ-మెయిల్‌ హెల్ప్‌లైన్‌ ద్వారా దీనిని చేయవచ్చు. ఓయో సాధారణంగా కేరళలలో డిమాండ్‌ను చుట్టుపక్కల నగరాలు, రాష్ట్రాలు అయినటువంటి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి చూస్తుంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ కేరళలలో 19 నగరాలలో 200కు పైగా హోటల్స్‌, 90కు పైగా హోమ్స్‌తో 4500 కు పైగా రూమ్‌లను నిర్వహిస్తుంది.
 
ఈ అభివృద్ధి గురించి హర్షిత్‌ వ్యాస్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌- ఫ్రాంచైజీ వ్యాపారం, ఇండియా అండ్‌ సౌత్‌ ఏసియా, ఓయో మాట్లాడుతూ ‘‘కేరళలలో పర్యాటక నిబంధనలను రాష్ట్రప్రభుత్వం సడలించడాన్ని స్వాగతిస్తున్నాం. దశల వారీగా ఇక్కడ పర్యాటక ప్రాంతాలను తెరువనున్నారు. రాష్ట్రంలోని మా హోటల్స్‌లో నూతన శానిటైజ్డ్‌ స్టే అనుభవాలతో అతిథులను స్వాగతించేందుకు మేము సిద్ధమయ్యాము. భారతదేశంలో అగ్రశ్రేణి పర్యాటక కేంద్రాలలో కేరళ ఒకటి. మాకు అత్యుత్తమ ఫలితాలను స్ధిరంగా అందిస్తున్న బలీయమైన మార్కెట్‌లలో ఇది ఒకటి.
 
రాష్ట్రంలో మా ఉనికి పరంగా అగ్రస్థాయి పర్యాటక కేంద్రాలైనటువంటి కొచి, త్రివేండ్రం, కాలికట్‌, వేనాడ్‌ తదితర ప్రదేశాలలో ఉన్నాయి. మేము ఇటీవలనే అంతర్గతంగా వినియోగదారుల అధ్యయనం నిర్వహించాం. ఇది వెల్లడించే దాని ప్రకారం 57% మంది యాత్రికులు విశ్రాంత ప్రయాణాలను కోరుకుంటున్నారు. తమ తరువాత ట్రిప్‌కు కేరళ అత్యున్నత ప్రదేశంగా నిలుస్తుంది. అక్టోబర్‌ 2 నుంచి అక్టోబర్‌ 4 వరకూ దాదాపు 1.8 నుంచి 2 లక్షల మంది అతిథులు దేశవ్యాప్తంగా ఓయో హోటల్స్‌లో లాంగ్‌ వీకెండ్‌ గడిపారని వెల్లడించేందుకు సంతోషిస్తున్నాము. లీజర్‌ ట్రావెల్‌ కోసం ఈ గ్రీన్‌ షూట్స్‌, వినియోగదారులకు పెరుగుతున్న విశ్వాసాన్ని తెలుపుతాయి. ఊహించిన దానికన్నా వేగంగా పర్యటనలు తిరిగి వస్తాయని ఆశిస్తున్నాము. భారతదేశంలో రాబోతున్న లీజర్‌ ట్రావెల్‌డిమాండ్‌ను తీర్చేందుకు, మేము మా ఎస్సెట్‌ భాగస్వాములతో కలిసి సురక్షితమైన, శానిటైజ్డ్‌ స్టేస్‌ అనుభవాలను మా అతిథులకు అందించనున్నాము’’ అని అన్నారు.
 
కొచిలోని హోటల్‌ ఫోర్ట్‌ కాసెల్‌ యజమాని పాట్రిక్‌ ఆండ్రీ మాట్లాడుతూ, ‘‘ అతిథులు ఇప్పుడు, ఎప్పుడూ కూడా పరిశుభ్రతతో కూడి, చక్కటి సమీక్షలు కలిగిన హోటల్స్‌ కోసం మాత్రమే చూస్తుంటారు. ఓయోతో కలిసి మేము పనిచేయడంతో పాటుగా యాత్రికుల అవసరాలను మేము తీరుస్తున్నాము. శానిటైజ్డ్‌ స్టేస్‌లో భాగంగా అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు మరియు మార్గదర్శకాలు మా అతిథుల నడుమ విశ్వాసాన్ని కలిగించడంతో పాటుగా ఓయోను ఎంచుకునేందుకు ప్రోత్సహిస్తున్నాయి. యాత్రికుల కోసం రాష్ట్రంలో అవకాశాలను తెరువడం ద్వారా, నూతన మార్గదర్శకాలతో, అన్ని భద్రతా ప్రమాణాలను  అనుసరిస్తూ వారికి ఒత్తిడి లేని హాలీడే అనుభవాలను  అందించడానికి సిద్ధమయ్యాం’’ అని అన్నారు.
 
ఓయో ఇటీవలి నిర్వహించిన వినియోగదారుల అధ్యయనంలో, దేశవ్యాప్తంగా లీజర్‌ ట్రావెల్‌కు డిమాండ్‌ వేగంగా వృద్ధి చెందుతుంది. వినియోగదారులు నమ్మకమైన, స్వచ్ఛమైన మరియు శానిటైజ్డ్‌ వసతుల కోసం ఎక్కువగా వెదుకుతున్నారు. 80% మంది వినియోగదారులు సురక్షిత, శానిటైజ్డ్‌ వసతులను వెదుకుతున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని, ఓయో ఇప్పుడు పలు భద్రతా ప్రమాణాలను మరియు కార్యక్రమాలను కోవిడ్‌-19 ప్రభావం అతి తక్కువగా ఉండేలా చేపట్టడంతో పాటుగా చక్కటి నాణ్యత కలిగిన ప్రయాణాలు మరియు ఆతిథ్య అనుభవాలను తమ శానిటైజ్డ్‌ స్టేస్‌ ట్యాగ్‌‌ను శానిటైజేషన్‌, పరిశుభ్రత, చురుకైన యంత్రసామాగ్రి కోసం బ్యాక్‌గ్రౌండ్‌ పరీక్షలను చేయడం ద్వారా అందిస్తుంది.
 
వినియోగదారులు మరియు హోటల్‌ ఉద్యోగుల భద్రతకు భరోసా అందిస్తూ ఆతిథ్య రంగ సంస్థ, చెక్‌ ఇన్‌, చెక్‌-ఔట్‌ కోసం అతి తక్కువ స్పర్శ కలిగిన ఎస్‌ఓపీలను అనుసరిస్తుంది. అంతేకాకుండా తమ సిబ్బందికి విస్తృత స్థాయిలో శిక్షణను అందిస్తూనే నూతన మార్గదర్శకాలకనుగుణంగా పని వాతావరణం (ఆరోగ్య పరీక్షలు, డిస్‌ఇన్‌ఫెక్టింగ్‌, డిస్టెన్స్‌ మార్కర్స్‌ మొదలైనవి) అందిస్తుంది. ఓయో ఇప్పుడు అంతర్జాతీయ కన్స్యూమర్‌ గూడ్స్‌ కంపెనీ యునిలీవర్‌తో  భాగస్వామ్యం చేసుకుని ఓయో ప్రోపర్టీల వ్యాప్తంగా మరింతగా శానిటైజేషన్‌ ప్రయత్నాలను వృద్ధి చేస్తుంది.
 
ఇటీవలనే కంపెనీ, తమ యాప్‌పై వినియోగదారుల కోసం కోవిడ్-19 టెస్టింగ్‌ సహాయాన్ని డాక్టర్‌ లాల్‌ పాత్‌ ల్యాబ్స్‌, ఎస్‌ఆర్‌ఎల్‌ డయాగ్నోస్టిక్స్‌, 1ఎంజీ మరియు ఇండస్‌ హెల్త్‌ ప్లస్‌తో భాగస్వామ్యం చేసుకుని అందిస్తుంది. ఐసీఎంఆర్‌ అనుమతించిన పాథాలజీ ల్యాబ్‌ల ద్వారా వీరు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ కంపెనీ యొక్క డెడికేటెడ్‌ హెల్ప్‌లైన్‌ మరియు 24గంటల చాట్‌ అసిస్టెంట్‌ యో, హెల్ప్‌లు క్లిష్టత లేని బుకింగ్‌ అనుభవాలను, సౌకర్యవంతమైన క్యాన్సిలేషన్‌ అవకాశాలను అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌.. లోన్ పొందడం కూడా ఇక సులభమే..?