Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ : దావూద్ ఇబ్రహీం పెరట్లో మూలాలు!!!

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ : దావూద్ ఇబ్రహీం పెరట్లో మూలాలు!!!
, గురువారం, 15 అక్టోబరు 2020 (16:36 IST)
దేశంలో సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్‌లో మూలాలు పాకిస్థాన్‌లో నివాసం ఉండే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నివాసం పెరటితోట వరకు పాకాయినట్టు తేలింది. బంగారం అక్రమ రవాణా ద్వారా వచ్చే నగదును తీవ్రవాద కార్యకలాపాల కోసం ఖర్చు చేస్తున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) వెల్లడించింది. 
 
ఇటీవల కేరళ రాష్ట్రంలో గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్ వెలుగు చూసిన విషయం తెల్సిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఓ మాజీ దౌత్య ఉద్యోగి స్వప్న సురేష్ కావడం గమనార్హం. అత్యున్నత స్థాయి అధికార వర్గాలతో ఉన్న పరిచయాల ఆధారంగా స్వప్న సురేశ్ బంగారం అక్రమ రవాణాలు కీలక సూత్రధారిగా వ్యవహరించారు. 
 
దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది. అంతేకాకుండా, ఈ కేసులో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. పైపెచ్చు.. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన కార్యదర్శి ఎం.శివశంకర్‌కు స్వప్న సురేశ్‌తో సంబంధాలున్నాయని ఆరోపణలు రావడంతో ఆయన్ను విధుల నుంచి తప్పించారు. 
 
ఇకపోతే, ఈ కేసును దర్యాప్తు చేసుతున్న ఎన్.ఐ.ఏ.... తాజాగా న్యాయస్థానానికి కీలక సమాచారంతో ఓ నివేదికను సమర్పించింది. ఈ బంగారం తరలింపులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, మాఫియా కింగ్ దావూద్ ఇబ్రహీం పాత్ర ఉందని భావిస్తున్నట్టు ఎన్ఐఈ న్యాయస్థానానికి వెల్లడించింది. 
 
బంగారం అక్రమరవాణా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాద కార్యక్రమాలకు, జాతి వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడని నిఘా వర్గాలు సమాచారం అందించాయని ఎన్ఐఏ వివరించింది. నిందితుల్లో ఒకడైన రమీజ్‌ను విచారించడం ద్వారా ఎన్ఐఏ కీలక సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా మొగుడు అందగాడు, పడుకో తప్పేంటి? భర్తకు భార్య సపోర్ట్, ఎక్కడ?