Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌తో భాగస్వామ్యం మాకు ఒక గేమ్-ఛేంజర్ అంటున్న ఓయో

Advertiesment
Global Hospitality Technology Company  OYO

డీవీ

, శుక్రవారం, 21 జూన్ 2024 (16:26 IST)
Global Hospitality Technology Company OYO
గ్లోబల్ హాస్పిటాలిటీ టెక్నాలజీ కంపెనీ, ఓయో, హైదరాబాద్‌లోని హోటల్ ఈస్టిన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన  తమ హోటల్ భాగస్వాములను సత్కరించింది.  దేశవ్యాప్తంగా 100 మందికి పైగా హోటళ్ల వ్యాపారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  వీరిలో చాలా వరకు ఓయో యొక్క యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉన్నారు. ఓయో యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌ మొదటి తరం హోటళ్ల యజమానులు తమ  వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రోత్సహిస్తుంది. 
 
 ఈ వేడుక,  ఓయో యొక్క భాగస్వామ్య హోటల్ యజమానుల యొక్క ఆదర్శప్రాయమైన అంకితభావం మరియు కృషిని వేడుక చేసింది, వారి అత్యుత్తమ విజయాలు మరియు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ఓయో విజయానికి  వారు అందించిన తోడ్పాటు పై ప్రత్యేకంగా  దృష్టి కేంద్రీకరించింది.  ఈ కార్యక్రమం  ఒక గొప్ప వేడుకగా, ఒక గాలా డిన్నర్, ప్రత్యక్ష వినోదం మరియు ఓయో యొక్క హోటల్ భాగస్వాముల మధ్య నెట్‌వర్కింగ్ మరియు సహకారం కోసం అవకాశాలను కలిగి ఉంది.  హోటల్ యజమానులు తమ  అసాధారణ సహకారాల కోసం ప్రశంసా పత్రాల చేత  గుర్తించబడ్డారు.  
 
 ఈ కార్యక్రమంలో, ఓయో యొక్క సీనియర్ లీడర్‌షిప్ టీమ్, చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనుజ్ తేజ్‌పాల్‌తో సహా;  వరుణ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మరియు ఆశిష్ లాబ్రూ, హెడ్, సప్లై స్ట్రాటజీ, రెవెన్యూ అండ్ మార్జిన్స్ మరియు నితిన్ ఠాకూర్,  గ్లోబల్ హెడ్, స్ట్రాటజిక్ అలయన్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆశిష్ సౌరభ్, రీజియన్ హెడ్, సౌత్, ఇతర టాప్ మేనేజ్‌మెంట్ హోటళ్ల యజమానులను  సత్కరించేందుకు హాజరయ్యారు.  ఓయో యొక్క అతిథులు అధిక-నాణ్యత కలిగిన , సరసమైన వసతిని ఆస్వాదించేలా చూసేందుకు హోటల్ భాగస్వాములు  అందిస్తున్న అచంచలమైన మద్దతు మరియు చూపుతున్న అంకితభావానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
 
 ఓయో యొక్క చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనూజ్ తేజ్‌పాల్ మాట్లాడుతూ , "ఓయో యొక్క యాక్సిలరేటర్ ప్రోగ్రామ్, ఎంతోమంది మా హోటల్ భాగస్వాములకు వృద్ధి అవకాశాలను కల్పించింది. ఇప్పుడు వారు భారతదేశం అంతటా తమ వ్యాపారాన్ని విస్తరించగలుగుతున్నారు. మా భాగస్వామ్య నెట్‌వర్క్  లో  శ్రేష్ఠతను గుర్తించి, రివార్డ్ చేయాలనే మా నిబద్ధతకు ఈ కార్యక్రమం ఒక నిదర్శనం.  తమ అద్భుతమైన విజయాల ద్వారా  అత్యుత్తమ పనితీరు కనబరిచిన హోటల్‌ యజమానులందరినీ అభినందిస్తున్నాము" అని అన్నారు. 
 
 హల్సియోన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ మేనేజింగ్ పార్టనర్‌లు లీతేష్ ముండ్లూరు, ఎంకట ఫణీంద్ర చౌదరి మాట్లాడుతూ "ఓయో యొక్క యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌తో భాగస్వామ్యం మాకు ఒక గేమ్-ఛేంజర్. ఈ ప్రోగ్రామ్ ద్వారా అందించబడిన మద్దతు మరియు వినూత్న పరిష్కారాలు మా కార్యకలాపాలను క్రమబద్ధీకరించాయి, వృద్ధిని వేగవంతం చేశాయి.  ఓయో యొక్క నైపుణ్యం తో , మేము మా అతిథి అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా, మా ఆదాయం పరంగా వృద్ధిని సైతం చేరుకున్నాము.  ఈ పరివర్తన ప్రయాణంలో భాగమైనందుకు మేము గర్విస్తున్నాము" అని అన్నారు. 
 
 టిప్సీ ఇన్ సూట్స్ హెడ్ విజయ్ యాదవ్ మాట్లాడుతూ “నేను ప్రస్తుతం గుర్గావ్‌లో 10 హోటళ్లను నిర్వహిస్తున్నాను. త్వరలోనే జైపూర్, రిషికేశ్, ముస్సోరీస్ మరియు కేదార్‌నాథ్ వంటి ఇతర నగరాలకు విస్తరించేందుకు ప్రణాళిక  చేస్తున్నాను. తద్వారా మరింత మంది అతిథుల అవసరాలు తీర్చగలము.   ఓయో ఫోకస్‌తో కూడా సరిపోయే ఈ ప్రయాణంలో నేను ప్రీమియం ప్రాపర్టీలపై దృష్టి సారిస్తున్నాము" అని అన్నారు. 
 
 ఓయో తమ హోటల్ భాగస్వాములకు మద్దతు ఇస్తూనే యాత్రికులకు  నాణ్యమైన వసతిని అందించడంలో నిబద్ధత చూపుతూ,  ప్రపంచ హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌గా దాని వృద్ధిని ముందుకు తీసుకెళ్లింది.  సంస్థ యొక్క బలమైన ప్లాట్‌ఫారమ్, సాంకేతికతతో నడిచే పరిష్కారాలు మరియు అతిథులు మరియు భాగస్వాములు ఇద్దరికీ సౌకర్యవంతమైన  అనుభవాన్ని సృష్టించే అంకితభావం ఈ విజయాన్ని సాధించడంలో కీలకంగా ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళకు భారీ వర్షపాతం.. ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌లు