Publish Date: Fri, 10 Oct 2025 (16:50 IST)
Updated Date: Fri, 10 Oct 2025 (16:52 IST)
గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్టివల్ 2025లో వివిధ ఆవిష్కరణలను అమేజాన్ పే ఈరోజు ప్రకటించింది. కుటుంబంలో ఎవరైనా తక్షణమే UPI చెల్లింపులను చేయడానికి, బయోమెట్రిక్ ప్రమాణీకరణ, నమ్మకమైన స్మార్ట్ డివైజ్‌లకు UPI చెల్లింపుల విస్తరణ చేయడానికి UPI సర్కిల్‌ను విస్తరించింది. ఖర్చు చేసే పరిమితులను ముందుగా సెట్ చేయడం ద్వారా UPIతో తక్షణమే చెల్లించడానికి UPI సర్కిల్ ఇప్పుడు ప్రాథమిక UPI ఖాతాదారులు సురక్షితంగా కుటుంబ సభ్యులను, నమ్మకమైన పరిచయస్తులను చేర్చడానికి వీలు కల్పించింది.
చేర్చబడిన ప్రతి సభ్యునికి తమ సొంత UPI ఐడి లేదా QR కోడ్ కలిగి ఉంటారు కానీ బ్యాంక్ అకౌంట్లు ఆపరేట్ చేయవలసిన అవసరం లేదు కానీ ప్రాథమిక ఖాతాదారులు ఆమోదించిన నిర్ణయించబడిన నిధుల మొత్తాన్ని పొందగలరు. అన్ని చెల్లింపులు PIN లేకుండా చెల్లించవచ్చు. భద్రత కోసం అదనపు బయోమెట్రిక్ ప్రమాణీకరణతో ప్రారంభించబడతాయి. చెల్లింపుల అభ్యర్థనలను సమీక్షించడం, ఖర్చు పరిమితిని ఏర్పాటు చేయడం, ఖర్చులను పర్యవేక్షించడం మరియు వివరణాత్మకమైన చెల్లింపు రికార్డ్స్ ను పొందడం సహా వినియోగంపై ప్రాథమిక యూజర్ పూర్తి నియంత్రణను కలిగి ఉంటారు.
NPCIతో వ్యూహాత్మకంగా చేసిన సహకారంలో, అమేజాన్ పే చెల్లింపు వ్యవస్థని స్మార్ట్ ఫోన్లకు మించి నమ్మకమైన స్మార్ట్ డివైజ్‌లకు కూడా విస్తరిస్తోంది. ఈ కార్యక్రమం స్మార్ట్ వాచీలు, ఇతర వేరబుల్స్‌కు సురక్షితమైన చెల్లింపు సామర్థ్యాలను తెచ్చింది, ఆధునిక బయోమెట్రిక్ ప్రమాణీకరణ, డివైజ్ స్థాయి ఎన్ క్రిప్షన్, వాస్తవిక సమయంలో మోసం గుర్తించడం వంటి ఫీచర్లను కలిగి ఉంది. యూజర్లు త్వరలోనే వేగవంతమైన ట్యాప్ అండ్ గో చెల్లింపులు చేయగలరు, తక్షణ లావాదేవీ నోటిఫికేషన్స్ స్వీకరించగలరు మరియు బహుళ కనక్టెడ్ డివైజ్ లలో కుటుంబ చెల్లింపులను నిర్వహించగలరు - ఇవన్నీ బ్యాంక్ స్థాయి భద్రతతో నిర్వహించబడతాయి.
UPI సర్కిల్ సమీకృత డిజిటల్ చెల్లింపుల పట్ల పరివర్తనాపరమైన చర్యను సూచిస్తోంది. అమేజాన్ పేలో, మేము నిజమైన కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి కట్టుబడ్డాము. ఈ ఫీచర్లు పూర్తి కుటుంబం UPIతో సురక్షితమైన, సౌకర్యవంతమైన చెల్లింపులు చేయడానికి పెరుగుతున్న అవసరాన్ని నెరవేరుస్తుంది అని గిరీష్ కృష్ణన్, డైరెక్టర్ పేమెంట్స్ & మర్చంచ్ సర్వీసెస్, అమేజాన్ పే ఇండియా అన్నారు.
చెల్లింపుల కోసం నమ్మకమైన స్మార్ట్ డివైజ్ లు యొక్క విభిన్నమైన శ్రేణిని వినియోగించడానికి అమేజాన్ పే ఇప్పుడు అందించే సామర్థ్యం అనేది ఇబ్బంది లేని వాణిజ్యం పట్ల మా యొక్క కలను సాకారం చేసుకునే దిశగా గణనీయమైన చర్యను సూచిస్తోంది. దీని ద్వారా ఏదైనా విశ్వశనీయమైన డివైజ్ సురక్షితమైన చెల్లింపు సాధనంగా మారుతుంది. ఈ ఫీచర్ రోజూవారీ లావాదేవీలను మార్చడాన్ని వాగ్థానం చేసింది, వాటిని వేగంగా చేయడమే కాకుండా, ప్రాథమికంగా కూడా మరింత సురక్షితంగా మరియు సహజంగా లక్షలాది భారతీయులకు చేసింది. UPI సర్కిల్‌తో కలిపి, భారతదేశం అంతటా ఉన్న ఇళ్లల్లో డిజిటల్ చెల్లింపు స్వీకరణను వేగవంతం చేయడంలో మేము సహాయపడగలమని విశ్వసిస్తున్నాము అని కృష్ణన్ అన్నారు.