ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్‌లో ఆగస్టు 5వ తేదీ నుంచి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ పేరుతో సేల్ తేదీలు ప్రకటిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు అందివ్వనుంది. ఈ సేల్ ఆగస్టు 9వ తేదీ వకు కొనసాగనుంది.
స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు సహా ఎలక్ట్రానికి ఉత్పత్తులపై 50 శాతం వరకు డిస్కౌంట్ అందివ్వనుంది. రియల్‌మీ, శాంసంగ్, వన్ ప్లస్ తదితర బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లపై 40 శాతం డిస్కౌంట్‌తో పాటు ఎస్‌బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం రాయితీ పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు కంపెనీ సేల్స్ విభాగం విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొంది. ల్యాప్‌టాప్, ఇయర్ ఫోన్, స్మార్ట్ వాచ్ తదితర ఉత్పత్తులపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని వివరించింది.
అయితే, ఏయే కేటగిరీల్లో ఎంత శాతం డిస్కౌంట్ ఉంటుందనే ఖచ్చితమైన వివరాలను మాత్రం వెల్లడించలేదు. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర హోం అప్లయన్స్‌పైనా భారీ ఆఫర్లు ప్రకటించనున్నట్టు కంపెనీ వర్గాల సమాచారం. వీటితో పాటు గేమింగ్ ప్రొడక్టుల పైనా 80 శాతం డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉందని తెలిపింది.