Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమేజాన్ డెలివరీ ఉమెన్ ఏం చేసిందో తెలుసా? (వీడియో)

అమెజాన్ సంస్థలో పని చేసే డెలివరీ ఉమెన్ ఓ పాడుపని చేసింది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఇంటి యజమాని షాక్ తిన్నాడు. ఇంతకీ ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్ధాం.

అమేజాన్ డెలివరీ ఉమెన్ ఏం చేసిందో తెలుసా? (వీడియో)
, సోమవారం, 4 డిశెంబరు 2017 (16:08 IST)
అమెజాన్ సంస్థలో పని చేసే డెలివరీ ఉమెన్ ఓ పాడుపని చేసింది. సీసీటీవీ ఫుటేజ్ చూసిన ఇంటి యజమాని షాక్ తిన్నాడు. ఇంతకీ ఏం జరిగిందో ఓసారి పరిశీలిద్ధాం. కాలిఫోర్నియాకు చెందిన నెమి బౌటిస్తా అనే వ్యక్తి తన ఇంటి ముందు ఏదో దుర్గంధభరితమైన వాసన రావడాన్ని పసిగట్టాడు. అటూఇటూ చూశాడు. తన ఇంటి ముందు మలం ఉంది. సరె.. ఏదో కుక్క ఈ పని చేసుంటుందిలే అని అనుకొని... ఆ కుక్క ఓనర్ పని పడదామనుకొని.. తన ఇంట్లో అమర్చిన సీసీటీవీ ఫూటేజ్‌ను చెక్ చేశాడు. ఫూటేజ్ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. 
 
అమేజాన్ సంస్థ డెలివరీ వర్కర్‌గా నెమి బౌటిస్తా అనే మహిళ పని చేస్తోంది. ఈమె ఆ ఏరియాలో ప్రాడక్ట్స్ డెలివరీ మహిళగా పని చేస్తోంది. ఈమె తన ట్రక్‌ను ఓ ఇంటిముందు ఆపి ఆ పని పూర్తి చేసింది. ఆ తర్వాత ట్రక్ వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన నెమి వెంటనే ఫేస్‌బుక్‌లో ఈ ఉదంతాన్నంతా వివరిస్తూ పోస్ట్ పెట్టాడు. 
 
అమేజాన్‌కు కూడా ఈ పోస్ట్‌ను షేర్ చేశాడు. దీనిపై స్పందించిన అమేజాన్.. ఆ మహిళ అమేజాన్ రెగ్యులర్ వర్కర్ కాదని... అమేజాన్ థర్డ్ పార్టీ కాంట్రాక్టర్ ద్వారా డెలివరీ వర్కర్‌గా పనిచేస్తున్నదని.. అయినప్పటికీ.. ఆ మహిళ చేసిన పనికి తాము క్షమాపణలు చెబుతున్నామని కాల్ చేసి తెలిపింది.
 
<iframe width="777" height="361" src="https://www.youtube.com/embed/t7646MddF00" frameborder="0" gesture="media" allow="encrypted-media" allowfullscreen></iframe>

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చాక్లెట్ తీసిస్తామని బాలికను బాత్రూమ్‌కు తీసుకెళ్లి..?