నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు ఎత్తివేత.. డబ్బులు లేక ఏటీఎంల వెక్కిరింత
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత రిజర్వు బ్యాంకు విధించిన నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు సోమవారంతో తొలగిపోయాయి. అయితే, అనేక బ్యాంకులు, ఏటీఎంలలో నగదు నిల్వలు లేక ప్రజలు మాత్రం ఎప్పటిలా ఇబ్బందులు పడ్డారు
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత భారత రిజర్వు బ్యాంకు విధించిన నగదు విత్‌డ్రాలపై ఆంక్షలు సోమవారంతో తొలగిపోయాయి. అయితే, అనేక బ్యాంకులు, ఏటీఎంలలో నగదు నిల్వలు లేక ప్రజలు మాత్రం ఎప్పటిలా ఇబ్బందులు పడ్డారు.
గతేడాది నవంబర్ 8న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఒక్కసారిగా దేశ ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ కొరత నెలకొంది. దీంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద కరెన్సీ ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు నగదు ఉపసంహరణపై ఆర్బీఐ పలు పరిమితులు విధించింది. విడతల వారీగా వీటిని ఎత్తివేస్తామని ప్రకటించింది.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 28న సేవింగ్ ఖాతాల నుంచి నగదు ఉపసంహరణ పరిమితిని వారానికి రూ.24 వేల నుంచి రూ.50 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించింది. కాగా తాజాగా విత్‌డ్రాపై అన్ని ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ.. నగదు లేక ఏటీఎంలు వెక్కిరిస్తుండడంతో వినియోగదారులకు సాంత్వన దొరికినట్టుగా కనిపించడం లేదు.