Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త్వరలో జరుగనున్న జైపూర్ జ్యువెలరీ షో 2023 కోసం హైదరాబాద్‌లో వైభవంగా రోడ్‌షో

image
, బుధవారం, 25 అక్టోబరు 2023 (19:45 IST)
త్వరలో జరుగబోయే మెగా జ్యువెలరీ షో-జైపూర్ జ్యువెలరీ షో (జెజెఎస్) కోసం అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న రోడ్‌షోలలో భాగంగా 'జెజెఎస్ సినర్జీ’ని హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో నిర్వహించారు. ఈ రోడ్‌షోలో వివిధ నగరాల నుంచి పెద్ద సంఖ్యలో జ్యువెలర్స్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో, జెజెఎస్ గౌరవ కార్యదర్శి, శ్రీ రాజీవ్ జైన్ జైపూర్‌లోని JECCలో జరగనున్న జైపూర్ జ్యువెలరీ షో యొక్క రాబోయే ఎడిషన్‌ వివరాలను వెల్లడించారు. జెజెఎస్‌కు ఇది 21వ ఎడిషన్ కాగా డిసెంబర్ 22 నుండి 25 డిసెంబర్, 2023 వరకు ఇది జైపూర్‌లో జరుగనుంది.
 
ప్రముఖ జ్యువెలరీ అసోసియేషన్ లైన TCJA కార్యదర్శి శ్రీ ప్రవీణ్, HJMA అధ్యక్షుడు శ్రీ మహేంద్ర తాయల్, COA GJC శ్రీ మోహన్ లాల్ జైన్ మరియు మమ్‌రాజ్ ముసద్దిలాల్ జ్యువెలర్స్ నుండి శ్రీ అవినాష్ గుప్తా పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌కు జైపూర్ నగరాన్ని ఎందుకు ఎంపిక చేశారనే దాని గురించి సవివరంగా శ్రీ రాజీవ్ జైన్ వెల్లడించారు. జైపూర్‌కు మహోన్నత సంప్రదాయం ఉందని, నగరం లాగానే దాని చరిత్ర కూడా అంతే పురాతనమైనదని వెల్లడించారు. ఇక్కడ ఆభరణాలు, రత్నాల యొక్క అద్భుతమైన కళ కూడా అంతే ప్రసిద్ధి చెందినదని తెలిపారు. 20 సంవత్సరాల వ్యవధిలో, జెజెఎస్ జైపూర్ నగరం యొక్క ముఖ్యమైన వార్షిక కార్యక్రమంగా మారడం ఆశ్చర్యకరమన్నారు. అతిథులకు ప్రదర్శన గురించి మరింత సమాచారం ఇస్తూ, ఈ సంవత్సరం "పచ్చ, మీ రాయి.. మీ కథ" నేపథ్యంతో ఈ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది 'అని అన్నారు.
 
జెజెఎస్ చరిత్ర గురించి మాట్లాడుతూ, ప్రదర్శన 2004లో 67 బూత్‌లతో ప్రారంభించినప్పటి నుండి ఇప్పుడు 1100 బూత్‌లను కలిగి ఉందని, 200+ దరఖాస్తుదారులు ఇంకా వేచి ఉన్నారని అన్నారు. ప్రతి సంవత్సరం 35,000 నుండి 40,000 మంది సందర్శకులతో పాటు అంతర్జాతీయ వ్యాపారులు సైతం ఈ షో సందర్శించి, పాల్గొంటున్నారని ఆయన చెప్పారు. గత సంవత్సరం 51 బూత్‌ల మాదిరిగానే ఈ సంవత్సరం కూడా B2B ఇంటరాక్షన్ కోసం 80 బూత్‌లను “పింక్ క్లబ్” కలిగి ఉంటుందని శ్రీ జైన్ తెలియజేశారు. ఈ ఏడాది ఎమరల్డ్ ప్రమోషన్ గ్రూపులో 14 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జెజెఎస్ కోశాధికారి శ్రీ కమల్ కొఠారి కృతజ్ఞతలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేవలం 11 రోజుల్లోనే టీఎస్‌ఆర్టీసీ రూ.25 కోట్లు