Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భాగ్యనగరిలో దారుణం... మహిళపై ఇద్దరు మహిళల లైంగిక దాడి...

Advertiesment
victim woman
, మంగళవారం, 24 అక్టోబరు 2023 (09:11 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. భర్తతో గొడవపడి బస్టాండ్‌లో నిద్రించిన ఓ మహిళపై ఇద్దరు మహిళలు లైంగికదాడికి పాల్పడ్డారు. మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి మత్తు కలిపిన శీతలపానీయం ఇచ్చారు. ఆమె మత్తులోకి జారుకోగానే లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన రహ్మత్ నగర్ ప్రాంతంలో వెలుగు చూసింది. ఆపై ఆమె వద్ద నాలుగు తులాల బంగారు గొలుసు, చెవికమ్మలను దోచుకుని పారిపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రహ్మత్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ (38) ఈ నెల 13వ తేదీన భర్తతో గొడవపడి మనస్తాపంతో ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ రాత్రి యూసుఫ్‌ గూడ బస్టాండ్‌లోనే నిద్రపోయింది. దీన్ని గమనించిన ఇద్దరు మహిళలు.. ఆమెను పలకరించి విషయం అడిగి తెలుసుకున్నారు.
 
ఆపై ఇక్కడ ఉండడం మంచిది కాదని, తమ ఇంట్లో పడుకుని ఉదయం వెళ్లిపోవాలని చెబుతూ బ్రహ్మశంకరనగర‌లోని తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు శీతలపానీయం ఇచ్చారు. అది తాగిన బాధితురాలు మత్తులోకి జారుకుంది. మత్తులో ఉన్న ఆమెపై వీరిద్దరూ లైంగికదాడికి పాల్పడ్డారు. శరీరమంతా గోళ్లతో రక్కి గాయపరిచారు. తమ కామవాంఛ తీరిన తర్వాత ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు, చెవి కమ్మలు లాక్కున్నారు.
 
వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు ఇంటికి చేరుకుని భర్తకు చెప్పింది. గాయాలతో బాధపడుతున్న ఆమెను ఆసుపత్రిలో చేర్చిన భర్త అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాధితురాలు సోమవారం మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసహజ శృంగారంతోపాటు దోపిడీ, దొంగతనాలకు వారిద్దరూ పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ మహిళను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరో నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెరికా నుంచి ఐపీఎల్‌ క్రికెటర్‌ ఇంటికొచ్చారు.. తిరిగి రాని లోకాలకు..?