అమేజాన్ కీలక ప్రకటన.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పది లక్షల ఉద్యోగాలు

శనివారం, 18 జనవరి 2020 (12:17 IST)
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ కీలక ప్రకటన చేసింది. నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. రానున్న ఐదేళ్లలో భారత్‌తలో పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని అమేజాన్ ప్రకటించింది. ఇప్పటికే భారత్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ప్రకటించిన అమేజాన్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడించింది. 
 
భారత్‌లో 1 బిలియమ్ డాలర్లు దాదాపు రూ.7100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అమేజాన్ సిద్ధమైంది. ఈ విషయాన్ని అమేజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెల్లడించారు.  చిన్న, మధ్యతరగతి వ్యాపారాలను డిజిటలైజేషన్‌ చేసేందుకు గాను భారత్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు జెఫ్ బెజోస్ తెలిపారు.
 
తాజాగా ఐటీ, నైపుణ్యాభివృద్ధి, కంటెంట్‌ క్రియేషన్‌, రిటైల్‌, లాజిస్టిక్స్‌, తయారీ పరిశ్రమల్లో ఉద్యోగాలు సృష్టించనున్నట్లు జెఫ్ బెజోస్ వెల్లడించారు. అయితే, దీనిపై స్పందించిన కేంద్రమంత్రి పీయూష్ గోయల్... అమేజాన్ ఏమీ భారత్‌కు గొప్ప సాయం చేయడం లేదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్ల తర్వాతే అమేజాన్ పదిలక్షల ఉద్యోగాలను ఇస్తున్నట్లు ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం #Shirdi ఆలయం మూసివేత.. ప్రాముఖ్యం తగ్గిపోతుంది ప్లీజ్..ఆపండి..