Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వామ్మో చలిపులి... చర్మం పగలకుండా జాగ్రత్తలు ఇవే...

Advertiesment
వామ్మో చలిపులి... చర్మం పగలకుండా జాగ్రత్తలు ఇవే...
, బుధవారం, 19 డిశెంబరు 2018 (11:12 IST)
చలికాలం వచ్చేసింది. సాధారణంగా ఈ కాలం అంటే చాలామంది ఇష్టపడతారు. చల్లటి వాతావరణంలో బయట తిరగటానికి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తారు. కాని చల్లదనం శరీరానికి ఎంతమంచిదైనా, అది చర్మానికి  అప్పుడప్పుడు హాని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చర్మాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది ఎలాగో చూద్దాం.
 
1. ఏ కాలంలోనైనా చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో నీటి పరిమాణం తగినంత తప్పనిసరిగా ఉండాల్సిందే. చర్మ కణాలు నిరంతరం వాటి పని అవి చేసుకుపోవాలంటే చర్మానికి నీరు ఎంతో అవసరం. కనుక సాధ్యమైనంత నీరు తాగుతూ ఉండాలి. దీనివలన చర్మంలో తేమ ఉండి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. పండ్లరసాలు, హెర్బల్ టీ లాంటివి కూడా చర్మానికి మేలు చేస్తాయి.
 
2. ముఖ్యంగా ఈ కాలంలో చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిపోతుంది. దాంతో చర్మం పొడిబారి అందవిహీనంగా, ముడతలుగా, పొలుసులుగా కనిపిస్తుంది. కనుక వారానికి ఒకసారి ఎక్స్ ఫొలియేట్ తప్పకుండా చేసుకోవాలి. దీనివల్ల చర్మంలో పేరుకున్న మృతకణాలన్నీ  తొలగిపోతాయి. 
 
3. ముఖ్యంగా ఈ కాలానికి తగిన విధంగా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. విటమిన్ సి, బి, ఈ, జింక్, మెగ్నీషియం ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ కాలంలో పండ్లను ఎక్కువుగా తీసుకోవటం మంచిది. 
 
4. ముఖ్యంగా పెదాలు ఈ కాలంలో పొడిబారి పగుళ్లు రావడం జరుగుతుంది. కనుక చలికాలంలో పెదాలకు లిప్ బామ్ లేదా నెయ్యిని రాసుకోవచ్చు. ఈ కాలంలో పాదాల పగుళ్లు కూడా బాధ పెడుతుంటాయి. పగిలిన పాదాలను రాత్రి నిద్రించటానికి ముందు గోరువెచ్చని నీటిలో ఉప్పు, చిటికెడు పసుపు వేసి నానబెట్టాలి. తర్వాత పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకొని వైట్ పెట్రోలియం జెల్లీని రాసుకుంటే పాదాల పగుళ్లు పోవడమే కాకుండా మృదువుగా ఉంటాయి.
 
5. అన్నింటి కంటే శారీరక వ్యాయామం ద్వారా చర్మాన్ని మరింత ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు. వ్యాయామం కారణంగా చర్మంలోని మలినాలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. పైగా ఈ కాలంలో వ్యాయామం చేయడం వల్ల శరీరం ఉత్సాహవంతంగా ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాదుంప రసాన్ని తీసుకుంటే..?