మృదువైన చర్మం కోసం.. పుచ్చకాయ-పెరుగు ఫేస్ ప్యాక్!
పుచ్చకాయ శరీరానికి చలవచేయడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణలో ఎంతో ఉపయోగపడే ఈ పుచ్చకాయ చర్మ వ్యాధులు సోకకుండా మంచి ఔషధంలా పనిచేస్తుంది. అలాంటి పుచ్చకాయతో పెరుగు చేర్చిన ఫేస్
Publish Date: Fri, 22 Jul 2016 (17:33 IST)
Updated Date: Fri, 22 Jul 2016 (17:34 IST)
పుచ్చకాయ శరీరానికి చలవచేయడమే కాకుండా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణలో ఎంతో ఉపయోగపడే ఈ పుచ్చకాయ చర్మ వ్యాధులు సోకకుండా మంచి ఔషధంలా పనిచేస్తుంది. అలాంటి పుచ్చకాయతో పెరుగు చేర్చిన ఫేస్ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసుకుంటే.. ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.
ఫేస్ ప్యాక్... ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు తీసుకుని.. రెండింటిని బాగా కలిపి.. ముఖానికి మెడకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేస్తే ముఖానికి ప్రత్యేక అందం చేకూరుతుంది. పెరుగులో ఉన్న లాక్టిక్ ఆసిడ్, ఎంజైములు, పుచ్చకాయతో కలిసి చర్మాన్ని మృదువుగా, కోమలంగా తయారు చేస్తాయి.