Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టొమాటో.. నిమ్మరసం.. పెరుగు ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం

టొమాటో, నిమ్మరసం, పెరుగు ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం పొందవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జు, ఒక టేబుల్ స్పీన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలుపుకుని.. పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ

Advertiesment
Top tomato Face Packs to get Healthy
, గురువారం, 25 ఆగస్టు 2016 (11:08 IST)
టొమాటో, నిమ్మరసం, పెరుగు ఫేస్ ప్యాక్‌తో మెరిసే సౌందర్యం పొందవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల టమోటా గుజ్జు, ఒక టేబుల్ స్పీన్ నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలుపుకుని.. పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. అరగంట తర్వాత కడిగేస్తే.. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ ప్యాక్ ద్వారా చర్మం మృదువుగా తయారవుతుంది.
 
అలాగే పసుపు, నిమ్మరసం కూడా ముఖ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. నాలుగు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పసుపు పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి ఓసారి చేస్తే చర్మం కోమలంగా మారుతుంది.

నిమ్మ బ్లీచ్‌గా ఉపయోగపడితే, పసుపు యాంటీబయటిక్‌గా ఉపయోగపడుతుంది. ఇకపోతే.. బొప్పాయి గుజ్జును, పాలు కలిపి పేస్ట్‌గా చేసుకోవాలి. ఈ మిశ్రమం కూడా ముఖంపై మచ్చలను తొలగిస్తుందని బ్యూటీషన్లు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెలసరి సమయంలో ఈ ఆహారం తీసుకోండి.. బర్గర్లు, పిజ్జాల జోలికెళ్ళొద్దు..!