Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నెలసరి సమయంలో ఈ ఆహారం తీసుకోండి.. బర్గర్లు, పిజ్జాల జోలికెళ్ళొద్దు..!

కొత్తగా రుతుస్రావం అయిన టీనేజ్ అమ్మాయిలు లేదా మహిళలు నెలసరి సమయంలో ఆహార విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నెలసరి సమయంలో కొబ్బరి, బెల్లం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొబ్బరిలోనూ, నువ్వుల్లోనూ కొవ్వ

Advertiesment
Food during Menstruation - Foods for Menstrual Health
, గురువారం, 25 ఆగస్టు 2016 (10:47 IST)
కొత్తగా రుతుస్రావం అయిన టీనేజ్ అమ్మాయిలు లేదా మహిళలు నెలసరి సమయంలో ఆహార విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. నెలసరి సమయంలో కొబ్బరి, బెల్లం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొబ్బరిలోనూ, నువ్వుల్లోనూ కొవ్వు పాళ్లు ఎక్కువ కాబట్టి పరిమితి పాటిస్తే మంచిది. నెయ్యికి బదులు వెన్న వాడాలి. శాకాహారులైతే.. ఆకుకూరలు, కాయగూరలతో పాటు నట్స్, ఖర్జూరం వంటి ఇవ్వాలి. అటుకులు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూడాలి. మాంసాహారులైతే.. మాంసం, చేపలు, చికెన్‌లతో పాటు కోడిగుడ్డు, పాలు ఇవ్వొచ్చు. 
 
మాంసాహారం, శాకాహారం ఈ రెండింటిలోనూ ఐరన్ ఉన్నప్పటికీ మాంసాహారంలో హీమ్ ఐరన్ ఉంటుంది. అంటే… అది తిన్నవెంటనే ఒంటికి పడుతుంది. అదే శాకాహార పదార్థాల్లోని నాన్ హీమ్ ఐరన్ మన ఒంటికి పట్టాలంటే, అదనంగా విటమిన్-సి కావాలి. కాబట్టి ఐరన్ ఉండే శాకాహార పదార్థాలతో పాటు విటమిన్-సి ఉండే తాజా పండ్లు… జామ, నిమ్మ, నారింజ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. 
 
రుతుస్రావం అవుతున్న సమయంలో లిక్విడ్ ఫుడ్ తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, నీళ్లు తీసుకోవడం మంచిది. కెఫిన్ ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లను, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవాలి. కానీ బేకరీ ఐటమ్స్ అయిన చిప్స్, ఫ్రెంచ్‌ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాల వంటి జంక్‌ఫుడ్‌తో పాటు కెఫిన్ పాళ్లు ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శరీరం వేడైందా..? అయితే జంక్ ఫుడ్స్ తీసుకోవద్దు..!