జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. టమోటా గుజ్జును ఇలా?
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. విటమిన్ సి పుష్కలంగా వున్న పండ్లు తీసుకోవాలి. బత్తాయి, కమలాపండ్లు, కివి ఫ్రూట్స్, చెర్రీస్, స్ట్రాబెర్రీ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎరుపు, పసుపు రంగు పండ్లు ఎక్కువగా తీసుక
జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. విటమిన్ సి పుష్కలంగా వున్న పండ్లు తీసుకోవాలి. బత్తాయి, కమలాపండ్లు, కివి ఫ్రూట్స్, చెర్రీస్, స్ట్రాబెర్రీ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఎరుపు, పసుపు రంగు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్, మామిడి వంటి పసుపు రంగు పండ్లను కూడా తీసుకోవాలి. కూరగాయలను డైట్‌లో చేర్చుకోవాలి. సోయాబీన్ కూడా తీసుకోవాలి. ఇది యాంటీ- ఏజింగ్‌లా పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్స్ జుట్టుకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
అలాగే జుట్టుకు ఓట్ మీల్, టమాటో ప్యాక్ కూడా జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. టమాటా జుట్టుకు తేమని అందించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండింటిని పేస్టులా చేసుకుని.. జుట్టుకు ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. షాంపూలు ఉపయోగించకూడదు.
ఇక బాదం, తేనె కలిపిన మిశ్రమం వలన జుట్టుపై ఉండే మురికిని తొలగిపోతుంది. పాలు, ఒక చెంచా తేనె, ఒక చెంచా నిమ్మ రసం, ఒక చెంచా బాదం నూనె కలిపిన మిశ్రమాన్ని జుట్టుకు రాయండి. 20 నిమిషాల పాటు వుంచి.. కడిగేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.