Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్ట్రాబెర్రీ, నారింజ, బొప్పాయి ఫేస్ ప్యాక్స్‌తో మేలెంత..?

ఒక కప్పు బొప్పాయి గుజ్జులో రెండు టీస్పూన్లు పైనాపిల్‌ జ్యూస్‌, ఒక్కో టీస్పూను చొప్పున గ్లిజరిన్, పాలపొడి కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌ వేసి ఇరవైనిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మ

స్ట్రాబెర్రీ, నారింజ, బొప్పాయి ఫేస్ ప్యాక్స్‌తో మేలెంత..?
, మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (17:26 IST)
స్ట్రా‌బెర్రీతో ఈ సీజన్‌కి సరిపడే స్క్రబ్‌ని తయారు చేయవచ్చు. స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి దానిలో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం డీహైడ్రేషన్ కావడం తగ్గుతుంది.
 
అలాగే నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా పాలు, తేనె కలిపి స్క్రబ్‌ తయారు చేసుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల చలికాలం చర్మం పగలడం, పొడిబారడం వంటివి తగ్గుతుంది. వర్షాకాలానికి ఈ పొడి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ఇకపోతే.. ఒక కప్పు బొప్పాయి గుజ్జులో రెండు టీస్పూన్లు పైనాపిల్‌ జ్యూస్‌, ఒక్కో టీస్పూను చొప్పున గ్లిజరిన్, పాలపొడి కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌ వేసి ఇరవైనిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాబేజి రసానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే...