క్యాబేజి రసానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే...
మార్కెట్ లభించే సౌందర్యసాధనాలు వాడుతున్నా కూడా.. అప్పుడప్పుడు పండ్లు.. కూరగాయలతో చేసుకునే చికిత్సలు చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. అలాంటి పండ్లు, కూరగాయల ఉపయోగాలు గురించి తెల్సుకుందాం....
మార్కెట్ లభించే సౌందర్యసాధనాలు వాడుతున్నా కూడా.. అప్పుడప్పుడు పండ్లు.. కూరగాయలతో చేసుకునే చికిత్సలు చర్మానికి ఎంతో మేలుచేస్తాయి. అలాంటి పండ్లు, కూరగాయల ఉపయోగాలు గురించి తెల్సుకుందాం....
* నారింజ రసాన్ని ముఖానికి రాసుకుంటే... చర్మం మృదువుగా మారుతుంది.
* అరకప్పు పాలకు రెండు చెంచాల తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ముఖానికి రాసుకుని మర్దనా చేయాలి. ఇది చర్మానికి టోనర్‌లా పనిచేస్తుంది.
* క్యాబేజి రసానికి చెంచా తేనె కలిపి రాసుకుంటే ముఖంలో ముడతలు కనిపించవు.
* రెండు చెంచాల నిమ్మ రసానికి చెంచా తేనె కలిపి ముఖానికి చేతులకు పట్టించాలి. ఇది ఏ కాలంలోనైనా చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది.
* బొప్పాయి గుజ్జుకు తేనె కలిపి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. మొటిమలు మాయం కావడమే కాదు.. చర్మం తాజాదనంతో మెరిసిపోతుంది.
* జిడ్డు చర్మంతో ఇబ్బంది పడేవారు గోధుమ పిండిలో నీరు కలిపి ముఖానికి ప్యాక్ వేస్తే ముఖం నిగనిగలాడుతుంది.