సాధారణంగా చాలామంది ఇంటిని శుభ్రం చేయాడానికి రకరకాల కెమికల్ ఆయిల్స్ వాడుతుంటారు. ఈ ఆయిల్స్ శుభ్రం చేస్తే మురికి దొలగిపోతుంది కానీ, వాటిలోని కెమికల్స్ అలానే ఉండిపోతాయి. అందువలన నిమ్మ నూనెను ఉపయోగించండి.. మంచి ఉపశమనం లభిస్తుంది. నిమ్మలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు చాలా అధికం.
ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీటిలో కొద్దిగా నిమ్మనూనె కలిపి తుడుచుకుంటే ఇల్లంతా సువాసనగా ఉంటుంది. అలానే చర్మంపై గాయాలు, పుండ్లు ఉన్నచోట నిమ్మ నూనెను రాసుకుంటే మంచిది. తలనొప్పిగా ఉన్నప్పుడు నిమ్మనూనెను వాసన పీల్చుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. దాంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మెదడులో నరాలు ఉత్తేజితమవుతాయి.
ఒత్తిడి, నీరసం, అలసట వికారంగా ఉన్నప్పుడు ఈ నిమ్మ నూనెను వాసన పీల్చుకుంటే ఈ సమస్యలు తొలగిపోతాయి. అలానే ముఖంపై మెుటిమలు, నల్లటి మచ్చలు అధికంగా ఉన్నప్పుడు ఈ నూనెలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖం మచ్చలు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది.
చలికాలంలో పెదాల పగుళ్ల సమస్య అధికంగా ఉంటుంది. అలాంటప్పుడు నిమ్మ నూనెను పెదాలకు రాసుకుంటే పగుళ్లు తొలగిపోతాయి. చర్మం దురదలుగా ఉన్నప్పుడు నిమ్మ నూనెతో చర్మాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే.. దురదలు తొలగిపోతాయి.