మొటిమలు, మచ్చలకు చెక్ పెట్టాలంటే..? వెనిగర్, బొప్పాయి భేష్‌గా పనిచేస్తాయ్
మొటిమలు, మచ్చలు వేధిస్తున్నాయా? డబ్బులు పోసి క్రీములు కొనొద్దు. ఈ టిప్స్ పాటించండి చాలు. రెండు చెంచాల తేనె, ఒక చెంచా దాల్చిన చెక్కపొడి కలుపుకోవాలి. ఈ పేస్టు ముఖానికి పూతలా రాసుకుని 20 నిమిషాల తర్వాత గ
మొటిమలు, మచ్చలు వేధిస్తున్నాయా? డబ్బులు పోసి క్రీములు కొనొద్దు. ఈ టిప్స్ పాటించండి చాలు. రెండు చెంచాల తేనె, ఒక చెంచా దాల్చిన చెక్కపొడి కలుపుకోవాలి. ఈ పేస్టు ముఖానికి పూతలా రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే పచ్చి బంగాళాదుంపను ముక్కలుగా కోసుకోవాలి. ఆ ముక్కలతో ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాల అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడుక్కోవాలి.
నారింజ తొక్కల పొడిని రెండు చెంచాల మోతాదులో తీసుకుని దీనికి కొన్ని నీళ్లు చేర్చాలి. అలా వచ్చిన పేస్టును ముఖానికి రాసి ఇరవై నిమిషాల పాటు ఉంచి తరువాత కడిగేయాలి. ఒక చెంచా వెనిగరల్‌లో మూడు చెంచాల నీళ్లు కలపాలి. అందులో దూదిని ముంచి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల అనంతరం నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమలు మాయమవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు.