Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సహజసిద్ధమైన సౌందర్యానికి చిట్కాలు...

సహజసిద్ధమైన సౌందర్యానికి చిట్కాలు...
, గురువారం, 25 ఏప్రియల్ 2019 (21:41 IST)
మనం సరైన పద్దతులలో, సరైన సౌందర్య చిట్కాలను వాడడం వలన చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. కొన్ని రకాల ఇంట్లో ఉండే సౌందర్య చిట్కాల ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. సహజసిద్దమైన సౌందర్య చిట్కాలను వాడడం వలన మన ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
 
1. మన చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా మార్చుటకు తేనె బాగా ఉపయోగపడుతుంది. చర్మానికి తేనె రాయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మంపై మచ్చలకు, మొటిమలకు మంచి ఔషధంలా పని చేస్తుంది. ఎందుకంటే.. ఇది యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉండడం వలన. తేనె వలన చర్మం సున్నితంగా మారుతుంది.
 
2. వివిధ రకాల చర్మ సమస్యలకు దోసకాయ నుండి తీసిన రసం అద్భుతంగా పని చేస్తుంది. కంటి కింద నల్లని వలయాలు కలిగిన వారు తాజా దోసకాయ రసాన్ని కాటన్ లేదా పత్తిలో ముంచి నల్లని వలయాల మీద పది నుండి పదిహేనునిమిషాల పాటు ఉంచాలి. ఇలా కొంతకాలం చేయడం వలన మీ చర్మంపై నల్లని మచ్చలు మాయమవుతాయి.
 
3.‌ ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనెలు మీ చర్మం పైన ఉండే దుమ్ము, ధూళిలను పోగొడుతాయి. పడుకోటానికి ముందుగా ఆలివ్ ఆయిల్ లేదా సన్‌ఫ్లవర్ నూనెలను వాడటం వలన మీరు త్వరిత ఫలితాలను పొందుతారు.
 
4. మీ చర్మం ప్రకాశవంతంగా ఉండడానికి ట్యుమెరిక్ కలిపిన పాలలో శుభ్రమైన, మృదువైన గుడ్డను నానబెట్టండి. కళ్ళు మూసుకొని, ముఖం పైన కప్పుకొని 20 నిమిషాల తరువాత కడిగివేయండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవధాన్యాలలో ఒకటైన అలసంద... పవర్ ఏమిటో తెలుసా?