Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసుపును, తేనెతో కలిసి ముఖానికి రాసుకుంటే?

చర్మంపై గల మొటిమలు, మచ్చలు తొలగిపోవాలంటే పసుపును వాడండి. పసుపు అనేక రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అలాంటి పసుపును తేనెతో కలిపి ముఖానికి అప్లె చేస్తే మూసుకుపోయిన చర్మ రంధ్రాలు శుభ్రమవు

Advertiesment
Turmeric
చర్మంపై గల మొటిమలు, మచ్చలు తొలగిపోవాలంటే పసుపును వాడండి. పసుపు అనేక రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. అలాంటి పసుపును తేనెతో కలిపి ముఖానికి అప్లె చేస్తే మూసుకుపోయిన చర్మ రంధ్రాలు శుభ్రమవుతాయి. పెరుగు, పసుపు మిశ్రమాన్ని రాస్తే మొటిమలు మాయవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. గంధం, పసుపును పేస్ట్‌లా చేసి ముఖానికి ఐప్లె చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
 
అలాగే కలబంద గుజ్జులో పసుపు కలిపి ముఖానికి రాసుకుంటే ముఖఛాయ పెంపుతుంది. వేపాకులతో కలిపిన పసుపు రాసుకుంటే ముఖం మరింత కాంతివంతంగా మారుతుంది. పసుపులో నిమ్మరసం కలిపి ముఖంపై రాస్తే మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలు తొలగిపోతాయి. పసుపు, పాలు కలిపి కాటన్‌బాల్ సాయంతో ముఖంపై ఐప్లె చేస్తే డార్క్ స్పాట్స్ మాయమవుతాయి.   

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లాండ్ ప్రవాస తెలంగాణ తెలుగు కేలండర్ ఆవిష్కరణ