Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తేనె, నిమ్మరసాన్ని పెదవులకు రాస్తే.. నల్లటి పెదాలు.. గులాబీ రేకుల్లా..?!

తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాస్తే నల్లటి పెదవులకు చెక్ పెట్టవచ్చు. ఇంకా గులాబీ రేకుల్లాంటి పెదాలను పొందవచ్చు. పెరుగుతో, శెనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్

Advertiesment
Lighten Dark Lips
, శుక్రవారం, 1 జులై 2016 (16:54 IST)
చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలంటే.. ఇంట్లోనే ఈ సౌందర్య చిట్కాలను పాటించండి. శెనగ పిండి, పసుపు పొడి, నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ పాలతో కలిపి ముఖానికి రాసుకుని.. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.
 
ఆలివ్ ఆయిల్‌తో పంచదారను చేర్చి అరచేతిలో రుద్ది కడిగేస్తే.. అరచేతులు మృదువుగా మారుతాయి. బంగాళాదుంప రసాన్ని ముఖానికి వారానికి రెండు సార్లు రాసుకుంటే సన్ టాన్ నుంచి చర్మాన్ని రక్షించుకోవచ్చు. మచ్చలను తొలగించుకోవచ్చు. 
 
నల్లగా ఉన్నవారు పొటాటో జ్యూస్‌ను ముఖానికి రాసుకోవడం ద్వారా చర్మ ఛాయను పెంపొందించుకోవచ్చు. గుమ్మడి ముక్కలను కంటి చుట్టూ ఉంచి 10 నుంచి 20 నిమిషాల వరకు ఉంచి ఆపై కడిగేస్తే కంటి కిందటి వలయాలను దూరం చేసుకోవచ్చు.  బొప్పాయి పండు గుజ్జును ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలుండవు.  
 
పుల్లటి మజ్జిగను ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే ముఖ సౌందర్యం మెరుగవుతుంది. ఇలా ఒక నెలంతా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తేనె, నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాస్తే నల్లటి పెదవులకు చెక్ పెట్టవచ్చు. ఇంకా గులాబీ రేకుల్లాంటి పెదాలను పొందవచ్చు. పెరుగుతో, శెనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంపై ఏర్పడే ముడతలను తగ్గించుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బక్క పలచగా ఉన్నారా? ఎండుద్రాక్షలు తీసుకోండి బరువు పెరగండి..!