Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బక్క పలచగా ఉన్నారా? ఎండుద్రాక్షలు తీసుకోండి బరువు పెరగండి..!

ఎండుద్రాక్షలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీయాక్సిడెంట్లు, పీచు వంటివి రక్తహీనతను దరిచేరనివ్వవు. ఎండుద్రాక్షలకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. వీటిని క్రమం తప్పకుండా రోజుకు ఆరు లేదా ఐదింటిని

బక్క పలచగా ఉన్నారా? ఎండుద్రాక్షలు తీసుకోండి బరువు పెరగండి..!
, శుక్రవారం, 1 జులై 2016 (16:40 IST)
ఎండుద్రాక్షలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీయాక్సిడెంట్లు, పీచు వంటివి రక్తహీనతను దరిచేరనివ్వవు. ఎండుద్రాక్షలకు జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తి ఉంది. వీటిని క్రమం తప్పకుండా రోజుకు ఆరు లేదా ఐదింటిని తీసుకుంటే.. చిన్న పేగులోని వ్యర్థ పదార్థాలను సులభంగా వెలివేసినవారమవుతాం. ఎండుద్రాక్షల్లోని పీచు కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు వంటి ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. 
 
వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉండటం ద్వారా బక్కపలచగా ఉన్నవారు తీసుకోవచ్చు. తద్వారా బరువు పెరుగుతారని న్యూట్రీషన్లు చెప్తున్నారు. క్రీడాకారులు తన శరీరానికి బలం చేకూర్చుకోవాలంటే.. ఎండుద్రాక్షల్ని తీసుకోవడం మంచిది. ఎండుద్రాక్షల్లోని ధాతువులు, కొలెస్టరాల్, విటమిన్లు, పీచు వంటివి శరీరానికి పోషకాలను అందిస్తాయి. వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. 
 
వీటిలోని యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్ కణాలను దూరం చేస్తాయి. హైబీపీని నివారిస్తాయి. గుండెను పదిలంగా ఉంచుతాయి. ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళ్లాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో విటమిన్ బి కాంప్లెక్స్, ఐరన్ ఉండటం ద్వారా రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రిపూట పెరుగు, ఆకుకూర తీసుకోకూడదా.. ఎందుకు..? కరివేపాకుతో తలనొప్పి మటాష్!