కళ్ల కింద నల్లటి వలయాలు, కళ్ల కింద ఉబ్బినట్లు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఇవి నిద్రలేమి, నీటి కొరత, ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, జన్యుపరమైన సమస్యల వల్ల కావచ్చు.
నల్లటి వలయాలను తగ్గించుకోవడానికి తగినంత నిద్ర పొందడం మంచిది. దీనితో పాటు ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ల వంటి పరికరాలను తక్కువగా ఉపయోగించమని నిపుణులు చెపుతారు. అయితే ఇలాంటి చిట్కాలు పాటించడమే కాకుండా కొన్ని ఫేస్ యోగా సహాయంతో కళ్ల కింద నల్లటి వలయాలను సులభంగా తొలగించుకోవచ్చు.
అది ఎలా చేయాలో చూద్దాం. మీ చూపుడు వేలుతో కంటి పైరెప్పపై వుంచి మధ్య వేలితో 5 నుంచి 10 సెకన్ల పాటు మెల్లగా కంటి కింద వున్న నల్లటి వలయాలపై నొక్కండి. కంటి కింద ఉన్న ప్రాంతాన్ని తేలికగా నొక్కడం ప్రారంభించండి.
కనుబొమ్మ పైభాగం వరకు వృత్తాకార కదలికలో ఈ ప్రాంతాన్ని మర్దించాలి. దీన్ని 10 నుండి 15 సార్లు రిపీట్ చేయండి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. మెరుగైన రక్త ప్రసరణ నల్లటి వలయాలను తగ్గిస్తుంది.