ఉసిరి పొడిలో నిమ్మరసం కలుపుకుని జుట్టుకు రాసుకుంటే?
ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు రాసుకుని 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన వెంట్రుకలు రాలే సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కొబ్బరి పాలలో నిమ్మరసం కలుపుకుని
ఉల్లిపాయ రసాన్ని జుట్టుకు రాసుకుని 20 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన వెంట్రుకలు రాలే సమస్యలు తొలగిపోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కొబ్బరి పాలలో నిమ్మరసం కలుపుకుని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.
గుడ్డు తెల్లసొనలో కొద్దిగా ఆలివ్ నూనె, లావెడర్ ఆయిల్, తేనె కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో నిమ్మరసం కలుపుకుని తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది. ఉసిరి కాయ పొడిలో నిమ్మరసం కలుపుకుని తలకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్యలు తొలగిపోయి జుట్టు బాగా పెరుగుతుంది.