Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొబ్బరి పాలు... తీసుకుంటే ఏంటి ఉపయోగం...?

Advertiesment
కొబ్బరి పాలు... తీసుకుంటే ఏంటి ఉపయోగం...?
, గురువారం, 3 జనవరి 2019 (18:08 IST)
సాధారణంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండటం కోసం పాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇస్తూ ఉంటాం. కేవలం పాలు మాత్రమే కాకుండా కొబ్బరిపాలు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి ఆరోగ్యపరంగానే కాకుండా అందంపరంగా కూడా ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం వాతావరణంలో పెరిగిపోతున్న కాలుష్యం వలన ముఖంపై మచ్చలు, మెుటిమలు బాధిస్తూ ఉంటాయి. వీటిని తొలగించుకోవటానికి కొబ్బరిపాలు ఎంతో చక్కగా పనిచేస్తాయి. వీటి ప్రయోజనమేమిటో తెలుసుకుందాం.
 
1. గోరువెచ్చని నీటిలో కొద్దిగా రోజ్ వాటర్, కొబ్బరి పాలు కలిపి ఈ మిశ్రమాన్ని స్నానికి ఉపయోగించాలి. ఈ విధంగా చేయడం వల్ల బాగా పాడైన చర్మం కూడా తిరిగి తాజాదనాన్ని సంతరించుకుంటుంది. కావాలనుకొంటే కొబ్బరి పాలను నేరుగా చర్మానికి అప్లై చేసుకుని నెమ్మదిగా మర్ధన చేసుకోవాలి. చర్మానికి తేమ అందడంతో పాటు చాలా సాప్ట్‌గా మారుతుంది. అంటే చర్మానికి కొబ్బరి పాలు సహజసిద్ధంగా మాయిశ్చరైజర్‌గా క్లెన్సర్‌గా కూడా పనిచేస్తుంది.
 
2. దుమ్ము, ధూళి దాంతో పాటే కాలుష్యం ప్రభావంతో చర్మం కళ కోల్పోతుంది. నిర్జీవంగా మారుతుంది. కాసిని గులాబీ రేకలు, చెంచా తేనె, అరకప్పు కొబ్బరి పాలను బకెట్ గోరువెచ్చని నీటిలో వేసుకుని స్నానం చేయాలి. దానివల్ల శరీరానికి తగిన తేమ అంది మేని కాంతివంతంగా తయారవుతుంది.
 
3. కొబ్బరి పాలల్లో రెండు చుక్కల నిమ్మరసం కలిపి పది నిమిషాల తర్వాత అందులో దూదిని ముంచి ముఖమంతా అద్దుకోవాలి. కాసేపయ్యాక కడిగేస్తే మోముపై పేరుకొన్న మురికి తొలగిపోవడమే కాకుండా చర్మం తాజాగా, కాంతివంతంగా మారుతుంది. 
 
4. కప్పు కొబ్బరి పాలల్లో, రెండు చెంచాల చొప్పున బాదం, తులసి పొడులు, రెండు చుక్కల తేనె చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత కాసిన్ని నీటితో తడిపి నలుగులా రుద్దాలి. తర్వాత గోరువెచ్చెని నీటితో శుభ్రం చేసుకోవాలి. తరచూ ఇలా చేస్తుంటే ముఖంపై ఉన్న మృత కణాలు తొలగి చర్మం మృదువుగా తయారవుతుంది. 
 
5. కొబ్బరి పాలలో విటమిన్ సి, కాపర్ ఉండటం వల్ల వీటిని ఆహారంలో భాగంగా కూడా చేర్చుకోవచ్చు. ఇవి చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేసి ముడుతలు, సన్నని గీతలు నివారించడంతో పాటు చర్మం సాగకుండా సంరక్షిస్తాయి. ఫలితంగా వృద్ధాప్య ఛాయలు అంత తొందరగా దరిచేరవు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందార పువ్వు టీ తాగితే..?