శనగపిండిని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్లు చర్మ సౌందర్యానికి ఉపయోగిస్తున్నారు. శనగపిండి అన్ని చర్మ తత్వాలకు సరిపోతుంది. ఎటువంటి చర్మ సంబంధిత సమస్యలను రానివ్వదు. చర్మ సమస్యలను తగ్గించి చర్మం మృదువుగా మారటానికి చాలా బాగా సహాయపడుతుంది. శనగపిండిని పేస్ ప్యాక్‌లకు ఉపయోగిస్తే అద్భుతమైన పలితాలను పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం.
1. ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ ఆలివ్ ఆయిల్, అరస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిముషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
2. ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల గ్రీన్ టీ వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పదిహేను నిముషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య నుండి బయట పడవచ్చు.
3. ఒక స్పూన్ శనగపిండిలో అరస్పూన్ అలోవెరా జెల్ కలిపి ముఖానికి పట్టించి రెండు నిముషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మంలో పొడి తగ్గి తేమగా ఉంటుంది.
4. ఒక స్పూన్ శనగపిండిలో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి పట్టించి రెండు నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. ఈ ప్యాక్‌ని వారంలో రెండుసార్లు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
5. ఒక స్పూన్ శనగపిండిలో రెండు స్పూన్ల తెల్ల చామంతి టీని కలిపి ముఖానికి పట్టించి ఇరవై నిముషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం మీద పేరుకున్న జిడ్డు, మురికి తొలగిపోతుంది.