పండగ పూట.. బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ వేసుకోండిలా..
బార్లీ గింజలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు బార్లీ గింజలను పేస్టులా చేసుకుని.. నానబెట్టిన నీటిని కూడా అందులోనే కలిపి.. ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొనను కూడా కలిపాలి. ముఖాన్ని చల్
దీపావళి పండగ పూట కొత్త దుస్తులు ధరించి మెరిసిపోతారు. ఈ అందానికి మరింత వన్నె తేవాలంటే ముఖానికి బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ వేసుకోండి అంటున్నారు.. బ్యూటీషియన్లు. మెగ్నీషియమ్, సెలీనియమ్, విటమిన్-బి, కాపర్, ఫాస్పరస్ పుష్కలంగా వుండే బార్లీ గింజలతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలంటే..?
బార్లీ గింజలను ముందు రోజు రాత్రి నానబెట్టాలి. మరుసటి రోజు బార్లీ గింజలను పేస్టులా చేసుకుని.. నానబెట్టిన నీటిని కూడా అందులోనే కలిపి.. ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొనను కూడా కలిపాలి. ముఖాన్ని చల్లనినీటితో శుభ్రం చేసుకోవాలి. తడి లేకుండా తుడిచేయాలి. ఆపై సిద్ధం చేసుకున్న బార్లీ గింజల పేస్టును ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరగంట పాటు అలానే వుంచాలి.
తర్వాత చల్లని నీటిని ముఖంపై చిలకరించి.. మృదువుగా వేళ్లతో రుద్దుతూ కడిగేయాలి. ఆపై మృదువుగా మారిన చర్మానికి కొద్దిగా మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా వారంలో రెండు లేదా మూడు సార్లు చేస్తే చర్మకాంతి పెరుగుతుంది.