Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రసాలతో అందానికి మెరుగులు...

ఈ రసాలతో అందానికి మెరుగులు...
, శనివారం, 15 జూన్ 2019 (22:46 IST)
సాధారణంగా స్త్రీలు అందంగా ఉండటం కోసం రకరకాల క్రీములను వాడుతుంటారు. బ్యూటీపార్లర్లకు వెళ్తూ ఉంటారు. కాని పైసా ఖర్చు లేకుండా సహజసిద్దంగా మనకు ప్రకృతిలో లభించే ఆహార పదార్ధాలు, పండ్లు, కూరగాయలతో మన అందాన్ని మరింత రెట్టింపు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.
 
1. ప్రతిరోజు తప్పనిసరిగా ఎక్కువుగా మంచినీటిని త్రాగాలి. ఇలా త్రాగడం వలన చర్మం పొడిబారిపోకుండా ఎంతో తేజోవంతంగా, అందంగా కనిపిస్తుంది. ముఖంపై మెుటిమలు, మచ్చలు తొలగిపోయి చర్మం ఎంతో కాంతివంతంగా, మెరుస్తూ ఉంటుంది.
 
2. క్యారెట్‌లో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. కనుక ప్రతిరోజు క్యారెట్ జ్యూస్ తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది. అసిడిటిని తగ్గిస్తుంది. 
 
3. బీట్‌రూట్ జ్యూస్‌ను క్రమంతప్పకుండా తాగడం వలన రక్తంలోని ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఈ జ్యూస్ రక్తంలోని మలినాలను తొలగిస్తుంది. కిడ్నీలను శుద్ది చేస్తుంది. దీనిని తరచూ తాగడం వలన చర్మ సౌందర్యాన్ని మరింతగా పెంచుకోవచ్చు. 
 
4. టమోటాలను జ్యూస్ చేసి ప్రతిరోజు త్రాగడం వలన కూడా ఎంతో ఆకర్షణీయమైన చర్మాన్ని పొందవచ్చు. యాపిల్ జ్యూస్ కూడా శరీరానికి మంచిపోషణను ఇచ్చి చర్మానికి మంచి గ్లో రావటానికి సహాయపడుతుంది.
 
5. చర్మం పొడిబారకుండా ఉండటానికి సన్ స్ర్కీన్ లోషన్ అన్ని కాలాలలోను తప్పనిసరిగా వాడాలి. దీనివలన చర్మం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా మంచిమెరుపును సంతరించుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాట్స్ ఆరోగ్య అవగాహన సదస్సు... ఆరోగ్యం, జీవనశైలి మార్పులపై సూచనలు