Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మొటిమలు తగ్గించాలంటే.. ఇలా చేయాలి..?

Advertiesment
face
స్త్రీల సౌందర్యంలో మొదటి స్థానం ముఖానికే. వాతావరణంలో మార్పులు, కాలుష్యం కారణంగా శరీరంలో ఏర్పడే మార్పుల వలన ముఖంపై మొటిమలు ఏర్పడుతుంటాయి. అయితే రోజంతా ముఖం కడుక్కోవడం వలన మొటిమలు ఏ మాత్రం తగ్గవు.

అంతేకాకుండా ఎక్కువ సార్లు ముఖాన్ని కడుక్కోవడం ద్వారా చర్మాన్ని నునుపుగా ఉంచేందుకు తోడ్పడే ముఖ్యమైన ఆయిల్స్ పోయి ముఖం డ్రైగా మారుతుంది. అందుకు ఏం చేయాలంటే.. రోజులో రెండు, మూడుసార్లు ముఖం కడుక్కుంటే సరిపోతుంది.
 
ముఖంపై మొటిమలు ఉన్నవారు చర్మానికి సరిపడే ప్రోడక్ట్‌ను ఎంచుకుని మేకప్ వేసుకోవాలి. అదేవిధంగా మొటిమలు ఎక్కువగా ఉన్నాయని అతిగా మేకప్ వేసుకుంటే పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖానికి వేసుకునే మేకప్ పదార్థాలను బ్రాండెడ్ ఉత్పత్తులను ఎంపికచేసుకుని వాడినప్పటికీ శరీరంలో ఏర్పడే కొన్ని రసాయన చర్యల వలన కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.
 
కొందరు ముఖాన్ని స్కబ్బింగ్ చేయడం వలన ఆయిల్ తగ్గి మొటిమలు తగ్గుతాయని అంటుంటారు. అది కేవలం అపోహ మాత్రం. ఎందుకంటే ముఖాన్ని స్కబ్ చేయడం వలన ఆయిల్ తగ్గదు, పైగా చర్మం దెబ్బతిని మొటిమలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. సాధారణంగానే వయసు పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా శరీరంలో డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరగడం వలన మొటిమలు రావడం తగ్గుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మలేరియా వ్యాధి... ఎలా నిరోధించాలి?