Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

Almonds

సిహెచ్

, బుధవారం, 3 జులై 2024 (20:28 IST)
శరీరం ఆరోగ్యం కోసం మనం ఎంతో కష్టపడుతుంటాము కానీ, దాని  మొదటి రక్షణ శ్రేణిగా నిలిచే చర్మ సంరక్షణను తరచుగా నిర్లక్ష్యం చేస్తుంటాము.  చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలంటే..
మీ చర్మాన్ని లోపలి నుండి పోషించుకోండి: మన ఆహార ఎంపికలు మన చర్మం యొక్క ఆరోగ్యం, రూపాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. అల్ట్రా-ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, చక్కెర అధిక వినియోగం చర్మ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలతో కూడిన ఆహారం చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

నారింజ, ఉసిరికాయ(గూస్బెర్రీ), నిమ్మ, ఆకు కూరలు, టొమాటోలు వంటి ఆహారాలను మీల్ ప్లాన్‌లలో క్రమం తప్పకుండా చేర్చవచ్చు. అదనంగా, బాదంపప్పులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, యువి రక్షణ ప్రయోజనాలు, విటమిన్ ఇ కంటెంట్ ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి, వృద్ధాప్య సంకేతాలను ఎదుర్కోవడానికి ప్రయోజనకరంగా ఉన్నట్లు చూపబడింది. నిజానికి, ప్రచురించిన ఆయుర్వేదం, సిద్ధ- యునాని గ్రంథాలు బాదం చర్మ ఆరోగ్యానికి మంచిదని, చర్మ కాంతిని పెంచుతుందని వెల్లడి చేస్తున్నాయి. 
 
హైడ్రేషన్ కీలకం: చర్మం కాంతివంతంగా ఉండటానికి తగినంత నీరు తీసుకోవడం చాలా అవసరం. నీళ్లతో పాటు, సరైన చర్మ ఆరోగ్యం కోసం డైట్‌లో సూప్‌లు, రసం, కొబ్బరి నీరు, ఇన్ఫ్యూజ్డ్ వాటర్, పండ్లు & పొట్లకాయ వంటి హైడ్రేటింగ్ ఎంపికలను చేర్చడాన్ని పరిగణించండి.
 
ఒత్తిడి నిర్వహించండి: ఒత్తిడి స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది చర్మం, మొత్తం ఆరోగ్యం, రెండింటినీ ప్రభావితం చేస్తుంది. యోగా, ధ్యానం మీ దినచర్యలో భాగం చేసుకోవటం ద్వారా ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.
 
అదనంగా, కొన్ని జీవనశైలి అలవాట్లు మీ చర్మం ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. మెరుగైన చర్మ ఆరోగ్యం కోసం మీరు దూరంగా ఉంచవలసినవి:
ధూమపానం: ఇది మీ ఊపిరితిత్తులకు హాని కలిగించడమే కాకుండా, వృద్ధాప్యం, ముడతలు ఏర్పడటాన్ని వేగవంతం చేస్తుంది.
అధిక ఆల్కహాల్ తీసుకోవడం: ఇది చర్మాన్ని నిస్తేజంగా, నిర్జీవంగా మారుస్తుంది.
నిద్ర లేకపోవడం: మీ చర్మాన్ని రిపేర్ చేయడానికి, పునరుద్ధరించడానికి మీకు తగినంత విశ్రాంతి, నిద్ర ఉండేలా చూసుకోండి.
పైచిట్కాలు మీ చర్మాన్ని పోషించడంలో సహాయపడతాయి, మీ మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తాయి.
-న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?