Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెంటిమెంట్ రిపీట్... ఐపీఎల్ 2019 కప్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్

Advertiesment
సెంటిమెంట్ రిపీట్... ఐపీఎల్ 2019 కప్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్
, సోమవారం, 13 మే 2019 (00:04 IST)
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఆఖరి బంతికి రెండు పరుగులు తీయాల్సిన సమయంలో చెన్నై ఆటగాడు మెక్ క్లింగన్ ఔట్ కావడంతో ముంబయి 1 పరుగు తేడాతో విజయం సాధించింది.
 
చివరి ఓవర్లో చెన్నై విజయానికి 9 పరుగులు అవసరమైంది. ఆ ఓవర్ మలింగ వేశాడు.
 
19 ఓవర్ తొలి బంతికి వాట్సన్ ఒక పరుగే చేశాడు.
 
19 ఓవర్ బంతికి జడేజా ఒక పరుగు చేశాడు.
 
19 ఓవర్ మూడో బంతికి వాట్సన్ రెండు పరుగులు రాబట్టాడు.
 
19 ఓవర్ నాలుగో బంతికి వాట్సన్ రనౌట్ అయ్యాడు.
 
19 ఓవర్ ఐదో బంతికి ఠాకూర్ రెండు పరుగులు చేశాడు.
 
19 ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు తీయడానికి ప్రయత్నించిన మెక్ క్లింగన్ రనౌట్ అయ్యాడు.
 
దీంతో ఒక్క పరుగు తేడాతో మ్యాచ్ ముంబయి వశమైంది.
 
11.18 గంటలు
 
బుమ్రా వేసిన 19వ ఓవర్లో డ్వేన్ బ్రావో(15) అవుట్ అయ్యాడు.
 
18వ ఓవర్లో ఓపెనర్ షేన్ వాట్సన్ హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు.
 
11.08 గంటలు
 
17 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 112/4
 
చెన్నై విజయానికి 18 బంతుల్లో 38 పరుగులు కావాలి.
 
11.00 గంటలు
 
15.4 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు వంద దాటింది.
 
అదే ఓవర్లో ఓపెనర్ షేన్ హాఫ్ సెంచరీ కూడా పూర్తైంది.
 
10.56 గంటలు
 
15 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 88/4
 
10.51 గంటలు
 
14 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 85/4
 
చెన్నై విజయానికి 36 బంతుల్లో 65 పరుగులు కావాలి.
 
10.43 గంటలు
 
చెన్నై 4వ వికెట్ కోల్పోయింది.
 
82 పరుగుల దగ్గర చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ అయ్యాడు.
 
హార్దిక్ పాండ్యా వేసిన 12వ ఓవర్ ఐదో బంతికి వాట్సన్ రెండో పరుగు కోసం ప్రయత్నించగా, ఇషాన్ కిషన్ త్రోకు ధోనీ రనౌట్ అయ్యాడు.
 
చాలాసేపు రీప్లేలు పరీక్షించిన థర్డ్ అంపైర్లు చివరికి ధోనీకి అవుట్ ఇచ్చారు.
 
10.31 గంటలు
 
11 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 73/3
 
22.28 గంటలు
 
11 ఓవర్ 4వ బంతికి 73 పరుగుల దగ్గర చెన్నై మూడో వికెట్ కోల్పోయింది.
 
బుమ్రా బౌలింగ్‌లో డి కాక్‌కు క్యాచ్ ఇచ్చిన అంబటి రాయుడు ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు.
 
10.22 గంటలు
 
70 పరుగుల దగ్గర రెండో వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్.
 
రాహుల్ చాహర్ వేసిన పదో ఓవర్ 3వ బంతికి సురేశ్ రైనా(8) పరుగులకు ఎల్‌బిడబ్ల్యు అయ్యాడు.
 
10.20 గంటలు
 
9 ఓవర్లకు చెన్నై సూపర్‌కింగ్స్. స్కోరు 70/1
 
10.10 గంటలు
 
7 ఓవర్లకు చెన్నై సూపర్ కింగ్స్ స్కోరు 57/1
 
9.52 గంటలు
 
5 ఓవర్లు ముగిసేటప్పటికి చెన్నై సూపర్‌కింగ్స్ స్కోర్ 38/1
 
9.50 గంటలు
 
క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా.
 
9.47 గంటలు
 
మొదటి వికెట్ కోల్పోయిన చెన్నై సూపర్‌కింగ్స్.. డుప్లెసిస్ ఔట్. 13 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు.
 
9.44 గంటలు
 
3 ఓవర్లు ముగిసేటప్పటికి చెన్నై సూపర్‌కింగ్స్ స్కోర్ 19/0
 
9.40 గంటలు
 
2 ఓవర్లు ముగిసేటప్పటికి చెన్నై సూపర్‌కింగ్స్ స్కోర్ 12/0
 
9.30 గంటలు
 
బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై సూపర్‌కింగ్స్.
 
నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చెన్నై సూపర్ కింగ్స్‌ ముందు 150 పరుగుల విజయ లక్ష్యం ఉంచింది.
 
149 పరుగులు చేసిన ముంబయి ఇండియన్స్
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్ జోరుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. కానీ 45 దగ్గర ఓపెనర్స్ ఇద్దరూ అవుటైపోవడంతో కష్టాల్లో పడింది.
 
శార్దూల్ ఠాకూర్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి 29 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్ వికెట్ కీపర్ ఎం.ఎస్ ధోనీకి క్యాచ్ ఇవ్వగా, తర్వాత ఓవర్ వేసిన దీపక్ చాహర్ మూడో బంతికి రోహిత్ శర్మ కూడా ధోనీకే క్యాచ్ అందించాడు.
webdunia
 
కెప్టెన్ రోహిత్ శర్మ 15 పరుగులకే అవుటైపోవడం ముంబయి ఇండియన్స్ అభిమానులను నిరాశపరిచింది.
 
తర్వాత జట్టు స్కోరు 82 దగ్గర మూడో వికెట్ పడింది. సూర్యకుమార్ యాదవ్(15) ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. మరో ఏడు పరుగుల తర్వాత కృణాల్ పాండ్య(7) కూడా భారీ షాట్ కొట్టబోయి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చాడు.
 
బంతి వేసిన తర్వాత కృణాల్ కొట్టిన షాట్‌ను అందుకోడానికి ముందుకు పరిగెత్తిన శార్దూల్ ఒకసారి అది మిస్సైనా రెండోసారి ఒడిసి పట్టాడు.
 
101 స్కోర్ దగ్గర ముంబయి ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో సురేష్ రైనాకు క్యాచ్ ఇచ్చాడు. తర్వాత హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్, ముంబయి ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య జట్టు స్కోరును 140 వరకూ తీసుకొచ్చారు.
 
ఇక జట్టు స్కోరు పెరుగుతుందని భావించిన ముంబయి అభిమానులకు దీపక్ చాహర్ మరోసారి షాక్ ఇచ్చాడు. దూకుడు పెంచాలనుకున్న హార్దిక్ పాండ్య(16) 19వ ఓవర్ మూడో బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు.
 
హార్దిక్ డీఆర్ఎస్ కోరినా ఫలితం లేకుండాపోయింది. తర్వాత ఒక వైపు పొలార్డ్ ధాటిగా ఆడుతున్నా అతడికి తోడు నిలిచే బ్యాట్స్‌మెన్ కరువయ్యారు. రాహుల్ చాహర్, మిచెల్ మెక్ క్లింఘన్ ఇద్దరూ వెంటవెంటనే డకౌట్ అవ్వడంతో స్కోరు 150 పరుగుల లోపే ఉండిపోయింది.
 
అందరూ అవుటవుతున్నా ఒకవైపు జోరు చూపించిన కీరన్ పొలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 3 సిక్సర్లు, 3 పోర్లున్నాయి. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి ముంబయి ఇండియన్స్ 8 వికెట్లు కోల్పోయి 149 మాత్రమే చేయగలిగింది.
 
చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 26 రన్స్ ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్ చెరి రెండు వికెట్లు తీశారు.
 
ధోనీ - రోహిత్... ఎవరు గెలిచినా రికార్డే...
ఐపీఎల్ - 2019లో ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఇటు ఎంఎస్ ధోనీ అభిమానులు, అటు రోహిత్ శర్మ అభిమానులు కూడా ఎవరికివారు తమకిష్టమైన ఆటగాడి నాయకత్వంలోని జట్టే గెలవాలని కోరుకుంటున్నారు.
 
ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ లేదా రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్న ముంబయి ఇండియన్స్‌లో ఎవరు గెలిచినా అది ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు కాబోతోంది.
 
అందుకు కారణం, ఈ రెండు జట్లూ చెరో మూడుసార్లు ట్రోఫీ గెలవడమే. ఈ రోజు మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టు నాలుగుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టిస్తుంది.
 
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ చూసేందుకు వచ్చిన క్రికెట్ ఫ్యాన్ చెన్నై, ముంబయి మధ్య నాలుగో ఫైనల్ చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం ఇది నాలుగోసారి. తొలిసారి 2010లో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో చెన్నై గెలిచింది.
 
అనంతరం 2013, 2015 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లలోనూ ఈ రెండు జట్లే తలపడ్డాయి. ఈ రెండు సందర్భాల్లోనూ ముంబయికి విజయం దక్కింది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు చెన్నై జట్టు ఇంతకుముందు ఏడుసార్లు ఫైనల్‌కు చేరి మూడుసార్లు విజయం అందుకోగా... ముంబయి ఇంతకుముందు నాలుగుసార్లు ఫైనల్‌కు చేరి మూడుసార్లు గెలిచింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రవాదులపై కాల్పులు జరిపేందుకు ఈసీ అనుమతి తీసుకోవాలా?