Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ధోనీ హెలికాఫ్టర్ షాట్ ఎప్పుడు కొట్టాడో తెలుసా?

Advertiesment
ధోనీ హెలికాఫ్టర్ షాట్ ఎప్పుడు కొట్టాడో తెలుసా?
, బుధవారం, 12 జూన్ 2019 (17:55 IST)
హెలికాప్టర్ షాట్ గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ధోనీ సిగ్నేచర్ షాట్ గురించి అందరికీ తెలిసిందే. టిక్ టాక్‌ యాప్‌లో కూడా చాలామంది ధోనీ స్టైల్‌లో హెలికాప్టర్ షాట్ కొడుతూ వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారు.

బ్యాట్స్‌మెన్ షూస్‌ను లక్ష్యంగా చేసుకొని బౌలర్లు వేసే యార్కర్లకు చాలాసార్లు బ్యాట్స్‌మెన్ వద్ద సమాధానం ఉండదు. కానీ, అలాంటి యార్కర్‌లను కూడా హెలీకాప్టర్ షాటతో అమాంతంగా స్టాండ్స్‌లోకి పంపే టెక్నిక్ ధోనీ సొంతం. ఈ షాట్ కొట్టడానికి బ్యాట్స్‌మెన్‌కు టెక్నిక్ కంటే ప్రాక్టీస్, టైమింగ్ చాలా ముఖ్యం. ఈ విషయంలో జార్ఘండ్ డైనమేట్ ఆరితేరాడు. 
 
అలా మొదలెట్టారు
2006లో గోవాలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డేలో జేమ్స్ అండర్సన్ వేసిన ఫుల్ లెంత్ బాల్‌ను ధోనీ తనదైన స్టైల్‌లో స్టాండ్స్‌లోకి పంపాడు. అప్పుడైతే ఎవరూ దాన్ని హెలికాప్టర్ షాట్ అని పిలవలేదు. ఒక కూల్ డ్రింక్ కంపెనీ తన ప్రకటనలో ధోనీతో ఈ షాట్‌ను హెలికాప్టర్ షాట్‌గా పిలిపించడంతో అప్పటి నుంచి దీన్ని అదే పేరుతో పిలుస్తున్నారు. ధోనీ బయోపిక్ 'ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాలో కూడా హెలీకాప్టర్ షాట్ ప్రస్తావన మనకు కనిపిస్తుంది.
 
దూసుకొస్తున్న యార్కర్‌ను క్రీజు దాటకుండా ఫ్లిక్ చేసి లెగ్ సైడ్‌ నుంచి అమాంతంగా స్టాండ్‌కు పంపే ఈ షాట్‌ను కనిపెట్టింది వాస్తవానికి ధోనీ కాదు. సంతోశ్ లాల్‌ అనే క్రికెటర్‌ది. అఫ్గానిస్తాన్ క్రికెటర్ ముహ్మద్ షహజాద్ కూడా తన దైన స్టైల్‌లో హెలికాప్టర్ షాట్ ఆడుతున్నాడు
 
ఎవరీ సంతోష్ లాల్
సంతోశ్ లాల్ కూడా క్రికెటరే. ధోనీ స్నేహితుడు. అతనితో కలిసి రంజీలకు ఆడాడు. ధోనీ ఇతనే వద్దే హెలీకాప్టర్ షాట్ నేర్చుకున్నట్లు ధోనీ మీద వచ్చిన బయోపిక్‌లో చూపించారు. జార్ఖండ్, బిహార్ తరఫున 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించిన సంతోశ్ లాల్... ధోనీతో పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేవాడు.
 
ఏడేళ్ల పాటు రంజీలకు ఆడిన సంతోశ్ 2013లో మరణించాడు. సంతోశ్ లాల్ అనారోగ్యంతో చివరి దశలో ఉన్నప్పుడు అతనికి ధోనీ అన్నివిధాలుగా సహాయం అందించాడు. మెరుగైన వైద్య సహాయం కోసం అతడిని రాంచీ నుంచి ఢిల్లీకి పంపేందుకు ఏయిర్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశాడు.
 
ధోనీ దారిలో పాండ్యా
అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనీ మొదలెట్టిన హెలికాప్టర్ షాట్‌ను చాలా మంది క్రికెటర్లు అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నారు. టీం ఇండియా ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా ..ధోనీ స్టైల్‌లో హెలికాప్టర్ షాట్ ఆడేస్తున్నాడు. అఫ్గానిస్తాన్ క్రికెటర్ ముహ్మద్ షహజాద్ కూడా తన దైన స్టైల్‌లో ఈ షాట్‌ కొడుతున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇల్లు అద్దెకివ్వమంటే... నా బాడీ, బ్రా సైజు అడిగాడు...