గర్భవతుల్లో రక్తహీనత తలెత్తితే ఏమవుతుంది?

సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (15:04 IST)
గర్భం ధరించిన తర్వాత మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిన్నచిన్న సమస్యలే పెద్ద సమస్యగా మారుతాయి. ముఖ్యంగా గర్భవతులు రక్తహీనత తలెత్తకుండా చూసుకోవాలి. గర్భవతుల్లో రక్తహీనత సమస్య తలెత్తితే కలిగే అనర్థాలు ఏమిటో చూద్దాం. 
 
1. అబార్షన్ అయ్యే ప్రమాదం వుంది.
2. బిడ్డ సరిగా బరువు పెరగకపోవడం వుంటుంది.
3. బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదల్లో లోపాలు.
4. ఇన్ఫెక్షన్లు కలుగవచ్చు.
5. నెలలు నిండక ముందే కాన్పు జరుగవచ్చు.
6. కాన్పు సమయంలో బ్లీడింగ్ ఎక్కువయితే తల్లి రక్తస్రావాన్ని తట్టుకోలేక ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం. 
కనుక గర్భిణీలు రక్తహీనత లేకుండా తగిన ఆహారాన్ని తీసుకోవాలి.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మునగాకుతో పచ్చడిని టేస్ట్ చేశారా?