Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలూ.. నిద్రలేచి వంటింట్లోకి పరుగులు తీస్తున్నారా? కాస్త ఆగండి..

మహిళలూ... ఆఫీసులకు వెళ్తే కంప్యూటర్ ముందు... ఇంట్లో వంటపని చేస్తూ.. ఇంటి గదులకే పరిమితమవుతున్నారా? అయితే జాగ్రత్త పడండి. నిద్రలేచి లేవగానే చాలామంది మహిళలు వంటింట్లోకి పరుగులు తీయడం మంచిది కాదు. అలా ప్

మహిళలూ.. నిద్రలేచి వంటింట్లోకి పరుగులు తీస్తున్నారా? కాస్త ఆగండి..
, శుక్రవారం, 7 అక్టోబరు 2016 (14:44 IST)
మహిళలూ... ఆఫీసులకు వెళ్తే కంప్యూటర్ ముందు... ఇంట్లో వంటపని చేస్తూ.. ఇంటి గదులకే పరిమితమవుతున్నారా? అయితే జాగ్రత్త పడండి. నిద్రలేచి లేవగానే చాలామంది మహిళలు వంటింట్లోకి పరుగులు తీయడం మంచిది కాదు. అలా ప్రకృతిని చూస్తూ.. సూర్య కిరణాల వేడి ఒంటిపై పడనివ్వాలి. ప్రకృతిలో గడపడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. 
 
ఉదయం పూట కాసేపు నడవండి. కాయగూరలు కొనడం, ఇరుగుపొరుగు వారితో మాట్లాడటం వంటివి చేయండి. దీని కోసం అరగంట కేటాయించండి. ఆ తర్వాత వంటగదిలోకి వెళ్లండి. ఇలా చేస్తే సానుకూల ప్రభావంతో రోజంతా హ్యాపీగా ఉంటారు. 
 
సాధ్యమైనంత వరకు మరుసటి చేయాల్సిన పనుల్ని.. అన్ని ఏర్పాట్లూ ముందే చూసుకుంటే కంగారు తప్పుతుంది. పిల్లల్ని బడికి పంపేటప్పుడైనా, మీరు ఉద్యోగానికి వెళ్లేటప్పుడైనా.. ఈ నియమం వర్తిస్తుంది. ఉదయం పూట వీలైనంత వరకూ కంగారు లేకుండా పని చేసుకోవడం వల్ల రక్తపోటు వంటి సమస్యలూ దరిచేరవు. ఉద్యోగినులకు పనిచేసే చోట ఉత్పాదకతా పెరుగుతుంది. 
 
రోజూ ఆఫీసు నుంచి అలసిపోయి రాగానే టీవీల ముందు కూర్చోకుండా.. పాటలు వినడం, డ్యాన్స్ చేయడం... ఇంటి చుట్టూ నడవడం చేయండి. త్వరగా పని ముగించుకున్నాక నచ్చిన పుస్తకం చదవడం, కాసేపు ఇష్టమైన సినిమా చూడటం చేయండి. అలా చేస్తే ఒత్తిడి మటాష్ అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసుపు కొమ్ముతో మేలెంతో.. మార్కెట్లో లభించే పసుపే వద్దే వద్దు..