పసుపు కొమ్ముతో మేలెంతో.. మార్కెట్లో లభించే పసుపే వద్దే వద్దు..
పసుపు కొమ్ములో ఎంతో మేలుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్‌లో వచ్చే కల్తీ పసుపులో రసాయనాలుంటాయి. అందుకే సహజంగా లభించే పసుపు మేనికి వాడటం ఎంతో మంచిది. పసుపు చర్మఛాయను మెరుగు పరుస్తుంది. రెండు
పసుపు కొమ్ములో ఎంతో మేలుంది. చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్‌లో వచ్చే కల్తీ పసుపులో రసాయనాలుంటాయి. అందుకే సహజంగా లభించే పసుపు మేనికి వాడటం ఎంతో మంచిది.
పసుపు చర్మఛాయను మెరుగు పరుస్తుంది. రెండు చెంచాల పసుపులో చిటికెడు సెనగ పిండి, పాలమీగడ, తేనె కలిపి పూతలా వేసుకోవాలి. అరగంటయ్యాక కడిగేయాలి. ఇలా రోజు మార్చి రోజు చేస్తుంటే నిగారించే ఛాయ సొంతమవుతుంది.
అలాగే మొటిమలు దూరం కావాలంటే.. నిమ్మరసం, రెండు చెంచాల మీగడ, బాదం నూనెలో కొద్దిగా పసుపు చేర్చి.. ముఖానికి పట్టించాలి. ఇవి ముఖంలోని మచ్చలను దూరం చేస్తాయి. పొడిచర్మం వారైతే నిమ్మరసానికి బదులు పాల మీగడ వాడాలి.