Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Advertiesment
Ice Apples

సెల్వి

, సోమవారం, 10 మార్చి 2025 (19:31 IST)
Ice Apples
వేసవి మొదలైంది. ఈ సీజన్‌లో మామిడి పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే తాటి ముంజలను కూడా వేసవి కాలంలో తీసుకోవడం మరిచిపోకూడదు. ఇవి శరీరాన్ని వేడి నుండి దూరంగా ఉంచుతుంది. శరీర వేడిని తగ్గించడమే కాదు.. ఇందులో ఉండే పోషకాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. 
 
ఇందులో ఇనుము, క్యాల్షియం, పొటాషియం, జింక్, విటమిన్ బి వంటి అనేక పోషకాలు ఉన్నాయి. తాటి ముంజలను తీసుకుంటే వేసవిలో ఏర్పడే చర్మ వ్యాధులను నివారిస్తుంది. వీటిని తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
అలాగే శరీరంలోని చెడు కొవ్వును కరిగించి శరీర బరువును తగ్గించే శక్తి తాటి ముంజలకు ఉంది. జీర్ణక్రియ, ఉదర రుగ్మతలను నయం చేస్తుంది. పేగులకు మేలు చేస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారు తాటి ముంజలు తీసుకోవడం ద్వారా రక్తహీనత సమస్య పరిష్కారమవుతుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాటి ముంజలను తీసుకుంటే అల్సర్ సమస్య తగ్గుతుంది. 
 
కంప్యూటర్ ముందు ఎక్కువసేపు పనిచేసే వారు తప్పకుండా వేసవిలో తాటి ముంజలు తీసుకోవాలి. ఇవి కళ్లకు ఎంతో మేలు చేస్తాయి. కళ్ళ అలసట కూడా తగ్గుతుంది. అదేవిధంగా, మధుమేహ వ్యాధిగ్రస్తులు తాటి ముంజలు తింటే, వారి రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. అజీర్ణం, కాలేయ సమస్యలు ఉన్నవారికి తాటి ముంజలు చాలా మంచిది.
 
ఇంకా వడదెబ్బతో బాధపడేవారికి తాటి ముంజలు ఒక గొప్ప ఔషధం. దీన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల డీహైడ్రేషన్ రాకుండా ఉంటుంది. దాహం తీరుతుంది.
 
మహిళలకు తాటి ముంజలు ఎలా మేలు చేస్తాయంటే?
గర్భిణీ మహిళలు తాటి ముంజలు తింటే జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. అలాగే, ఎండ వల్ల కలిగే శారీరక అలసట నుండి ఉపశమనం పొందడానికి తాటి ముంజలు మేలు చేస్తాయి. అలాగే పుచ్చకాయలను కూడా మహిళలు వేసవిలో తీసుకోవడం ద్వారా దానిలోని నీటి శాతం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. 
 
బాలింతలు తాటి ముంజలు తీసుకుంటే వారి తల్లి పాలు బాగా పడతాయి. అలాగే, శిశువుకు మంచి పోషకాహారం లభిస్తుంది. ఇంకా యూరీనరీ ఇన్ఫెక్షన్లు దరిచేరవు. తాటి ముంజలలోని ఆంథోసైనిన్ అనే రసాయనం మహిళల్లో రొమ్ము క్యాన్సర్ కణితులను నివారిస్తుంది. తాటి ముంజలను మహిళలు తీసుకోవడం ద్వారా తెల్లబట్ట సమస్య దరిచేరదు. 
 
గర్భిణీ స్త్రీలకు తాటి ముంజలు మంచిదే అయినప్పటికీ, మధ్యాహ్నం దాటిన తర్వాత తినకుండా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..