Publish Date: Sat, 03 Jan 2015 (14:00 IST)
Updated Date: Sat, 03 Jan 2015 (14:01 IST)
గర్భం పొందాలా? అయితే డైట్‌లో నట్స్ తీసుకోండి అంటున్నారు గైనకాలజిస్టులు. అన్ని రకార ఎండు ఫలాలు ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా.. గర్భం పొందడానికి ప్రత్యేకంగా బాదం ఉపయోగపడుతుంది.
గర్భం పొందేందుకు బాదం ది బెస్ట్ సూపర్ ఫుడ్. ఎందుకంటే, వీటిలో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల దీన్ని ఫెర్టిలిటీ సూపర్ ఫుడ్‌గా సూచిస్తున్నారు.
అందువల్ల , మీరు గర్భం పొందడానికి ప్రయత్నిస్తుంటే కనుక, ఈ ఫెర్టిలిటి సూపర్ ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవచ్చు. అలాగే ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల ఒక బలమైన ఎండోమెట్రియల్ లైనింగ్ ఏర్పడుతుందని, ఐరన్ అండం ఈ పొరకు బలంగా అంటిపెట్టుకోవడానికి సహాయపడుతుందని గైనకాలజిస్టులు చెబుతున్నారు.