Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేసవిలో గర్భిణీ మహిళలు లెమన్ జ్యూస్ తీసుకుంటే?

వేసవిలో గర్భిణీ మహిళలు లెమన్ జ్యూస్ తీసుకుంటే?
, సోమవారం, 30 మార్చి 2015 (18:16 IST)
వేసవిలో గర్భిణీ మహిళలు లెమన్ జ్యూస్ తీసుకుంటే? డీహైడ్రేషన్ సమస్యను దూరం చేసుకోవచ్చు. అలాగే చాలా మంది గర్భిణీ మహిళలు విటమిన్ సి లోపంతో బాధపడుతుంటారు. అలాంటి వారికి నిమ్మరసం ఇవ్వడం ఆరోగ్యదాయకం. గర్భిణీలు నిమ్మరసాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇతర సప్లిమెంట్స్ మీద ఆధారపడకుండా ఉండవచ్చునని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. 
 
నిమ్మరసంలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల దీన్ని మంచి క్లెన్సర్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది శరీరంలోని మలినాలను బయటకు నెట్టివేస్తుంది. శరీరాన్ని శుభ్రం చేస్తుంది. గర్భిణీ స్త్రీలు కొన్ని ఇన్ఫెక్షన్స్ నుండి దూరంగా ఉంచడానికి ఇది సహాయపడుతుంది. కొన్ని పరిశోధనల ద్వారా లెమన్ జ్యూస్ పొట్టలో పెరిగే శిశువుకు కూడా చాలా మంచిదని నిర్ధారించడం జరిగింది. నిమ్మరసంలో పొటాషియం ఉంటుంది. ఇది శిశువులో ఎముకలు పెరుగుదలకు అవసరమవుతుంది. అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్‌కు కూడా నిమ్మరసం పనికొస్తుంది. 
 
గర్భిణీగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటుకు గురికాకూడదు. కొన్ని పరిశోధనల ప్రకారం క్రోనిక్ హై బీపీ వల్ల ప్రీమెచ్చుర్ బర్త్ జరగవచ్చు. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల హైబిపి కంట్రోల్ అవుతుంది. అందువల్లే గర్భిణీస్త్రీలు లెమన్ జ్యూస్ ను తీసుకోవాలి. అలాగే నిమ్మరసం గర్భిణీ మహిళల్లో అజీర్తికి చెక్ పెడుతుంది. పాదాల వాపును నియంత్రిస్తుంది. 
 
గర్భధారణ సమయంలో నిమ్మరసం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించి అనేక ఇతర అసౌకర్యాలను నివారిస్తుంది. ఉదాహరణకు : కడుపు ఉబ్బరం, హార్ట్ బర్న్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఇందులో మెగ్నీషియం, మరియు క్యాల్షియం వంటివి ఉండటం వల్ల కొన్ని రకాల జబ్బులను, జ్వరం, జలుబు మరియు ఆస్త్మాను నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu