మిరియాలు వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. మిరియాలు నిత్యం ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తున్నారు. మిరియాలలో క్యాల్షియం, పాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, సి వంటి ఖనిజాలు రక్తంలో హిమోగ్లోబిన్ తయారడానికి చాలా సహాయపడుతాయి. అంతేకాదు.. రక్తహీనతను కూడా తగ్గిస్తాయి. ఇలాంటి మిరియాలు రెగ్యులర్‌గా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం...
1. మిరియాలు కాలేయంలో పైత్యరసం తయారటాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. కడుపునొప్పిగా ఉన్నప్పుడు గ్లాస్ నీటిలో కొద్దిగా మిరియాలు వేసి కాసేపు నానబెట్టి ఆ తరువాత సేవిస్తే నొప్పి తగ్గుతుంది.
2. మిరియాలలోని యాంటీ సెప్టిక్ జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి కాపాడుతుంది. కప్పు కాచిన నీటిలో మిరియాలు, అల్లం, తేనె, తులసి ఆకులు వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకుంటే శరీరంలోని వ్యర్థ పదార్థాలు తొలగిపోతాయి.
3. మిరియాలను మెత్తని పేస్ట్‌లా తయారుచేసి అందులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే ముడతల చర్మం పోయి ముఖం మృదువుగా మారుతుంది.
4. మిరియాలలోని యాంటీ ఆక్సిడెంట్స్ రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. శరీరో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి ఇన్‌ఫెక్షన్స్ తొలగించాలంటే మిరియాల పేస్ట్‌లో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి సేవిస్తే ఫలితం ఉంటుంది.
5. మధుమేహ వ్యాధితో బాధపడేవారు రోజూ మిరియాలతో తయారుచేసిన వంటకాలు తీసుకుంటే వ్యాధి అదుపులో ఉంటుంది. అంటే మిరియాలను నీటిలో మరిగించి అందులో కొద్దిగా చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, టమోటాలు, ఉల్లిపాయలు వేసి తీసుకుంటే మంచిది.
6. మిరియాలను తరచుగా తీసుకోవజం వలన రక్తంలోని షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. తద్వారా గుండె సంబంధిత వ్యాధులు దరిచేరని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.